Air India: టాటా గ్రూప్‌నకుచెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన లగేజీ పాలసీని మార్చింది. దేశీయ విమాన ప్రయాణాలకు ప్రీ బ్యాగేజీపై ఉన్న గరిష్ట పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్ ప్రయాణానికి గతంలో 20 కేజీలుగా ఉన్న బ్యాగేజీని ప్రస్తుతం 15 కేజీలకు తగ్గించింది. అంటే ఎవరైతే ఎకానమీలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ ఫేర్ కేటగిరీ టికెట్లు తీసుకుంటారో వారు ఇకపై గరిష్టంగా 15 కేజీలు మాత్రమే చెక్ ఇన్ బ్యాగేజీకి అనుమతి ఇస్తారు. ఈ కొత్త రూల్ మే 2 నుంచి అమలులోకి వచ్చింది.
గతంలో 25 కేజీల వరకు అనుమతి..
ఎయిర్ ఇండియా గతంలో 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతి ఇచ్చేది. టాటా గ్రూప్ చేతికొచ్చాక గతేడాది ఆ పరిమితిని 20 కిలోలకు తగ్గించారు. తాజాగా దానిని 15 కేజీలకు కుదించారు. కనీసం 15 కేజీల వరకు బ్యాగేజీని ఉచితంగా అనుమతించాలని డీసీసీఏ ఆదేశాలు ఉన్నాయి. దీంతో దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే పరిమితిని సవరిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఒక లగేజీని మాత్రమే అనమతిస్తుండగా, ఎయిర్ ఇండియా మాత్రం బరువు పరిమితికి లోబడి ఎన్ని బ్యాగులైనా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది.
ఫేర్ తరగతులు..
ఇక ఎయిర్ ఇడియా వివిధ రకాల ఫేర్ తరగతులను గతేడాది ప్రవేశపెట్టింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్‌లతోపాటు కంఫర్డ్, కంఫర్డ్ ప్లస్, ఫ్లెక్స్ పేరిట మూడు ఉప తరగతులను తీసుకొచ్చింది. వీటిలో టికెట్ ధరతోపాటు ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఎనానమీ ఫెక్స్ కేటరిగీ టికెట్ ఎంచుకుంటే 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతి ఇస్తారు.