Homeజాతీయ వార్తలుAir India Express Flash Sale: త్వరపడండి.. కేవలం రూ.1444కే విమాణ ప్రయాణం.. ఎక్కడి నుంచి...

Air India Express Flash Sale: త్వరపడండి.. కేవలం రూ.1444కే విమాణ ప్రయాణం.. ఎక్కడి నుంచి ఎక్కడి కంటే ?

Air India Express Flash Sale: విమానంలో ప్రయాణించాలని అందరూ అనుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటారు. అయితే విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడం అంత తేలికైన పని కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ చార్జీ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం విమానయాన రంగంలో పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకుని, ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి కంపెనీలు. ఈ క్రమంలో తక్కువ చార్జీలతో తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా మీరు కేవలం రూ.1444కే ప్రయాణించగలరని మీకు తెలుసా? అవును.. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఆ విమానయాన సంస్థలు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ ప్రకటించింది. ఇందులో మీరు చాలా చౌక ధరలతో విమానంలో ప్రయాణించే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ సేల్ కింద ధర రూ.1444 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడూ విమానంలో ప్రయాణించకపోతే మీరు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ ఆఫర్లు
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా ‘ఫ్లాష్ సేల్’లో ఎక్స్‌ప్రెస్ లైట్ ప్రయాణం రూ. 1444 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్ ప్రారంభ ధర రూ. 1599. ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. ఎందుకంటే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే.  బుకింగ్ 13 నవంబర్ 2024 వరకు మాత్రమే చేయబడుతుంది. ‘ఫ్లాష్ సేల్’ సేల్ ఆఫర్‌ల వివరాలను తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మీకు చౌక విమానాలను అందిస్తోంది. మీరు ‘ఫ్లాష్ సేల్’ ప్రయోజనాన్ని పొందడం ద్వారా విమానంలో ప్రయాణించాలనుకుంటే, 13 నవంబర్ 2024 వరకు బుకింగ్ చేయవచ్చు. ఈ కాలంలో, మీరు 19 నవంబర్ 2024 ,  30 ఏప్రిల్ 2025 మధ్య విమానంలో ప్రయాణించడానికి విమానాలను బుక్ చేసుకోవచ్చు.

ఎక్స్‌ప్రెస్ లైట్,  ఎక్స్‌ప్రెస్ బిజ్ ఛార్జీలు
ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్: ఈ ఫ్లైట్ ధర రూ. 1444 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై మీరు విడిగా 3 కిలోల ఉచిత క్యాబిన్ బ్యాగేజీని పొందుతారు. తమ విమాన ప్రయాణాన్ని పొదుపుగా కొనసాగించాలనుకునే వారి కోసం ఈ ప్రత్యేక ఆఫర్.
ఎక్స్‌ప్రెస్ బిజినెస్ ఫేర్: మీరు బిజినెస్ క్లాస్ లగ్జరీని అనుభవించాలనుకుంటే, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 25 శాతం తగ్గింపును ఇచ్చింది. బిజినెస్ క్లాస్ ప్రియులకు ఇదో గొప్ప అవకాశం.

ప్రత్యేక తగ్గింపులు
లాగిన్ అయిన సభ్యులకు కన్వీనెన్స్ ఫీజు లేదు. ఇది కాకుండా, లాయల్టీ సభ్యులకు ప్రత్యేక ఆఫర్ ఉంది. దీని కింద వారు ఆహారం, సీట్లు..  ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ సేవపై 25 శాతం తగ్గింపు పొందుతారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాలకు ప్రత్యేక రాయితీ ధరలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఈ వర్గాల ప్రజలు తమ విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా చేసుకోవచ్చు. మీరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ కింద ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటే www.airindiaexpress.com పై క్లిక్ చేయండి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper