AIADMK BJP: బీజేపీకి బిగ్‌ మిస్టేక్‌ చేస్తోందా.. మిత్రులు అందుకే దూరమవుతున్నారా?

బీజేపీ వరుసగా రెండుసార్లు సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పానటు చేసే మెజారిటీ సాధించింది. అయినా మిత్ర ధర్మాని పాటిస్టూ ఎన్డీఏ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 26, 2023 1:57 pm

AIADMK BJP

Follow us on

AIADMK BJP: దేశం రాజకీయాల్లో ప్రభావం చూపే పార్టీలు ప్రస్తుతం రెండే. ఒకటి అధికార బీజేపీ, రెండోది ప్రతిపక్ష కాంగ్రెస్‌. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భంగా అరుదు. ఏర్పాటు చేసినా అవి పూర్తిగా కొనసాగలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీని ఓడించేందకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏను మరింత బలోపేతం చేశారు. ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలైన ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఈ కూటమిలో చేరుకుని ఇండియా పేరుతో కలిసి వెళ్తున్నారు. ఈ కూటమి లక్ష్యం బీజేపీని గద్దె దించడమే. ఇండియా కూటమి బలంగా తయారవతుంటే.. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి మిత్రులు బయటకు వస్తున్నారు. మూడేళ్ల క్రితం చిరకాల మిత్రపక్షం శివసేన ఎన్డీఏ నుంచి యబటకు వచ్చింది. ఏడాది క్రితం అకాళీదల్, ఆతర్వాత జనతాదళ్‌(యూ) ఎన్డీఏను వీడాయి. తాజాగా ఏఐఏడీఎంకే కూడా కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అయితే ఇటీవల జేడీఎస్‌ ఎన్డీఏలో చేరడం ఊరటనిచ్చే అంశం.

ఎందుకు వీడుతున్నారు..
బీజేపీ వరుసగా రెండుసార్లు సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పానటు చేసే మెజారిటీ సాధించింది. అయినా మిత్ర ధర్మాని పాటిస్టూ ఎన్డీఏ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ ప్రస్తుతం శివసేన చీలిక వర్గం. ఆ తర్వాత స్థానంలో ఏఐఏడీఎంకే ఉన్నాయి. అయితే ఏఐఏడీఎంకే కూడా రెండ రోజుల క్రితం ఎన్డీఏకు గుడ్‌బై చెప్పింది. మిగిలింది శివసేన చీలికవర్గమే. మిగతావన్నీ చిన్నచిన్న పార్టీలే. అయితే ఎన్డీఏను మిత్ర పార్టీలు వీడడానికి కొన్ని కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా సొంతంగా బీజేపీకి మెజారిటీ ఉండడంతో నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటోంది. మిత్రపక్షాలను సంప్రదించడం లేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత మిత్రులకు చెబుతోంది. చట్టాల రూపకల్పనలోనూ మిత్రపక్షాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీజేపీ వైఖరి నచ్చని పార్టీలు ఇప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికలు చాలా కీలకం..
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు చాలా కీలకం. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. ఇక పదేళ్లు అ«ధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని, కేంద్రంలో అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మిత్రపక్షాలతో కలిసి సమష్టిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రులు బయటకు రావడం ఇండియా కూటమికి ప్లస్‌ పాయింట్‌గా భావిస్తున్నారు. అయితే బీజేపీ పొరపాటును సరిదిద్దుకుంటే.. మాత్రం మళ్లీ మిత్రులు ఎన్డీఏ గూటికి చేరతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.