https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌కు అదే పెద్ద మైనస్‌.. ఇప్పటికైనా మారకపోతే నష్టమే!

తెలంగాణ ఉద్యమ సారథిగా నాటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీని తెలంగాణ ప్రజలు 2014లో స్పష్టమైన మెజారిటీతో అధికారం అప్పగించారు.

Written By: , Updated On : September 26, 2023 / 02:08 PM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ మలిదశ ఉద్యమ సారథిగా, స్వరాష్ట్రం సాధించిన నేతగా.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా మంచి గుర్తింపు ఉంది. ఇదే ధీమాతో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు కేసీఆర్‌. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కంటే ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించారు గులాబీ బాస్‌. అయితే.. రెండుసార్లు సీఎంగా, 9 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌పై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంది. దీంతోపాటు కేసీఆర్‌ వైఖరి ఇటు సొంత నేతలకు, అటు విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. ఆ వైఖరే కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో నెగెటివ్‌ అయ్యే అవకాశం ఉంది.

విపక్షాలను చంపేయడం..
తెలంగాణ ఉద్యమ సారథిగా నాటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీని తెలంగాణ ప్రజలు 2014లో స్పష్టమైన మెజారిటీతో అధికారం అప్పగించారు. నాడు ప్రజలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కూడా కేసీఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ ఈసారి కూడా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. తాను గెలిస్తేనే చేపట్టిన పనులు పూర్తవుతాయని నమ్మించారు. దీంతో మళ్లీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కాదని టీఆర్‌ఎస్‌నే గెలిపించారు. 2014 కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చారు. అయితే కేసీఆర్‌.. ఫుల్‌ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. విపక్ష కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ఆ పార్టీలను కనుమరుగు చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్‌లో గెలిచినా.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారనేలా కాంగ్రెస్‌పార్టీని అభాసుపాలు చేశారు. గతంలో దీనిని ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఈ ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.

బీసీ, ఎస్సీ, ఎస్సీలపై చిన్నచూపు..
ఇక కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో ఎదురయ్యే మరో ఇబ్బంది వెనుకబడిన వర్గాలపై వివక్ష. కేసీఆర్‌కు దళితులు అంటే మొదటి నుంచి చిన్నచూపే. ఆయన అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొనకపోవడం, అంబేద్కర్‌ చిత్రపటానికి నమస్కరించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక తన పార్టీలో అగ్రవర్ణ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నంత ప్రాధాన్యం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం లేదు. ఇది తెలంగాణ ప్రజలకు బాగా అర్థమవుతోంది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. కేసీఆర్‌ వివక్షను సొంత పార్టీ నేతలు కూడా అంగీకరించడం గమనార్హం.

కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదు..
కాంగ్రెస్, టీడీపీలో ఉండి బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)లో చేరిన ఎమ్మెల్యేలు, నాయకులకు కేసీఆర్‌ వివక్ష పూరిత ౖÐð ఖరి స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మందికి అనుభవంలోకి కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగలి పురుగును అయినా కౌగిలించుకుంటాను అన్న కేసీఆర్‌ నాడు అందరితో కలిసిపోయాడు. అందరినీ కలుపుకుపోయాడు. అందరితో కలిసి భోజనాలు కూడా చేసేవాడు. కానీ నేడు వెనుకబడి వర్గాలు అంటే వెనకే ఉండాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వారి కుల వృత్తి చేసుకోవాలి, అగ్రవర్ణాలు మాత్రం అన్నిరంగాల్లో ముందుండాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఈ వైఖరిని తెలంగాణ సమాజం నిషితంగా గమనిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కేసీఆర్‌ ఈవైఖరి మార్చుకోకుంటే.. ఇదే పెద్ద మైనస్‌ అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.