Agricultural financial support : మరోసారి ప్రభుత్వం రైతులకు భారీ ఊరట ఇచ్చే శుభవార్త తెలిపింది. ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసింది. అన్నదాతలకు ప్రభుత్వం వారి ఖాతాలలో డబ్బులు అందించేందుకు రెడీ అవుతున్నారు. యాసంగి సీజన్లో అనూహ్యమైన వర్షాల కారణంగా భారీగా పంటలను నష్టపోయిన రైతుల కుటుంబాలకు ఇప్పుడు ఊరట లభించింది. భారీగా కురిసిన అకాల వర్షాల కారణంగా వరి, మక్క, పత్తి, సోయాబీన్ వంటివి తదితర పంటలు నీటిలో మునిగిపోయి భారీ నష్టం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ విత్తనాల, ఎరువుల మరియు కూలీల ఖర్చుతో ఆశించిన స్థాయిలో దిగుబడి కూడా రాకపోవడంతో చాలా ఆర్థికంగా కృంగిపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వికారాబాద్ జిల్లాలో ఉన్న బాధ్యత రైతులందరూ విన్నపించుకున్నారు. రైతుల మొర విన్న వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాలలో కూడా పరిశీలన చేసి పంటల నష్టం ఎంతవరకు జరిగింది అనే వాటిపై పూర్తి వివరాలను సేకరించి వాటిని సంబంధిత జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వడానికి కొన్ని వారాలు పట్టినప్పటికీ చివరికి స్పందించిన ప్రభుత్వం బాధ్యత రైతులకు నష్టపరిహారం మంజూరు చేసింది.
ప్రస్తుతం నష్టపరిహారం జారీ అవడంతో ఆయా జిల్లాల అధికారులు బాధిత రైతులకు ఖాతాలలో నగదు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడంతో కొంచెం ఊపిరి పీల్చుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొందడంతో పునః సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. వ్యవసాయ మార్గాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత రైతులను ఆదుకోవడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న బాధిత రైతులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిగి, దోమ, నవాబుపేట, పూడూరు, దుద్యాల, మర్పల్లి ఇలా మొదలైన జిల్లాలలో విపరీతమైన వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడడంతో నష్టపోయిన మొత్తం 823 మంది బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. జిల్లావ్యాప్తంగ 688 ఎకరాలలో సాగు చేసిన పంటలు జొన్న, వరి, మొక్కజొన్న మరియు కూరగాయలు వంటి తదితర పంటలకు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరగడంతో దీనికి సమానుగుణంగా ప్రభుత్వం ఒక ఎకరాకు రూ.పదివేల రూపాయల చొప్పున మొత్తం రూ.68 లక్షలకు పైగా నష్టపరిహారం ఇచ్చింది.