Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరకున్నారు. పంజాగట్టు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1 గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు.