Agnipath Scheme: భారత్ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం సమకూరనుంది. సైన్యంపై ఆర్థిక భారం తగ్గించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ‘‘అగ్నిపథ్’’ పేరిట కొత్త సర్వీ్‌సను తీసుకొచ్చింది. భద్రతపై కేబినెట్ కమిటీ మంగళవారం దీన్ని ఆమోదించిన కొద్దిసేపటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్‌తో యువతకు సాయుధ బలగాల్లోకి చేరేందుకు అవకాశం లభిస్తుంది’’ అని చెప్పారు. కాగా.. ఈ సర్వీసు కింద నియమితులయ్యే సైనికులను ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఎంపికైన వారిని నాలుగేళ్ల కాలానికి సర్వీసులోకి తీసుకుంటారు. 6నెలలపాటు శిక్షణ ఇచ్చి మూడున్నరేళ్లపాటు సర్వీసులో కొనసాగిస్తారు. ఈ సర్వీస్ పూర్తయిన తర్వాత మెరుగైన ప్యాకేజీ అందిస్తారు. అలాగే తుది దశ ఎంపికలో మెరుగైన ప్రతిభ చూపిన 25 శాతం మందికి రెగ్యులర్ కేడర్‌లోకి చేరడానికి అవకాశం కల్పిస్తారు.

అగ్నిపథ్ నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 45 వేల మందిని నియమిస్తామని పేర్కొంది. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ప్రకటించిన విద్యార్హత (ఇంటర్ లేదా ప్లస్ టూ)నే దీనికీ వర్తింపచేస్తారు.
Also Read: YCP Leaders Abuse Language: బూతులు అలవాటు పడి.. సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అగ్నిపథ్ సాయుధ దళాలకు మరణమృదంగంలా అనిపిస్తోందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఏటా నియమించుకునే యువతలో 75 శాతం నిరుద్యోగులుగా మారతారు. ఇది మంచి ఆలోచన కాదు’ అన్నారు. అగ్నిపథ్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. మోదీ నిర్ణయం త్రివిధ దళాల సామర్థ్యంపై రాజీపడేలా చేయగలదని ఆందోళన వ్యక్తం చేసింది. దేశసేవ చేసేందుకు యువతకు ఇది అద్భుతమైన అవకాశం కల్పిస్తుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇదిలా ఉండగా.. కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) త్వరలోనే జరుగుతుందని, రాజ్‌నాథ్ ఇదే సమావేశంలో వెల్లడించారు.

అగ్నిపథ్ ద్వారా అగ్నివీర్‌లుగా ఎంపికైన వారు ఆరు నెలల శిక్షణ అనంతరం ఎక్కడైనా సరే విధులు నిర్వర్తించేందుకు సి ద్ధంగా ఉండాలి. తొలి ఏడాది రూ.4.76 లక్షల వార్షిక ప్యాకేజీ అందిస్తారు. నాలుగో సంవత్సరంలో రూ.6.92 లక్షలు చెల్లిస్తా రు. సేవా నిధి కింద ప్రతి ఉద్యోగి జీతంలో 30ు చందాగా చెల్లిస్తారు. ప్రభుత్వం కూడా చెల్లించిన దానితో కలిపి.. నాలుగేళ్ల తర్వాత రూ.11.71 లక్షలు ఆదాయపన్ను మినహాయింపులతో అందిస్తారు. నాన్ కాంట్రిబ్యూటరీ జీవిత బీమా కింద రూ.48 లక్షలకు బీమా ఉంటుంది. సర్వీసులో ఉండగా ప్రాణా లు కోల్పోతే రూ.44 లక్షలు అదనపు పరిహారం, ది వ్యాంగులుగా మారితే.. 100 శాతం వైకల్యానికి రూ.44 లక్షలు, 75 శాతానికి 25 లక్షలు, 50 శాతానికి 15 లక్షలు చెల్లిస్తారు.
Also Read:India First-Ever Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు వచ్చేసింది.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
[…] […]