YCP Leaders Abuse Language: బూతులు అలవాటు పడి.. సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

YCP leaders Abuse Language: వయసుతో సంబంధం ఉండదు, మంచీ చెడ్డా విచక్షణ ఉండదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. నోరు విప్పితే బూతు పురాణమే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల తీరు ఇది. ప్రధానంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలు అన్నీఇన్నీకావు. అందునా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రులు జోగి రమేశ్‌, అంబటి రాంబాబు ఏకవచన […]

Written By: Dharma, Updated On : June 15, 2022 6:24 pm
Follow us on

YCP leaders Abuse Language: వయసుతో సంబంధం ఉండదు, మంచీ చెడ్డా విచక్షణ ఉండదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. నోరు విప్పితే బూతు పురాణమే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల తీరు ఇది. ప్రధానంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలు అన్నీఇన్నీకావు. అందునా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రులు జోగి రమేశ్‌, అంబటి రాంబాబు ఏకవచన ప్రయోగంతో విరుచుకుపడటంతోపాటు మధ్యమధ్యలో బూతులు మాట్లాడటం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. కొడాలి నానిని బూతుల మంత్రిగా కూడా పేర్కొనేవారు. జోగి రమేశ్‌నూ బూతుల ఘనాపాటిగానే చెబుతున్నారు. మాజీ మంత్రి అనిల్‌ కూడా ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడేవారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీతో సహజీవనం చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ నోట్లోంచి కూడా అప్పుడప్పుడు బూతులు వస్తుంటాయి. అయితే ఇప్పటి వరకూ ప్రతిపక్షనేతలపైనే బూతులతో విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనా బూతు పురాణాన్ని ప్రయోగిస్తున్నారు. తమకు తరతమ బేధాలు లేవని నిరూపించుకుంటున్నారు.

YCP leaders

నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరు ప్రసాదరాజుతో ఢీ కొట్టారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భీమవరంను జిల్లా కేంద్రం చేయడంపై కొత్తపల్లి విభేదించారు. అప్పటి నుంచి ప్రసాదరాజుతో ఆయనకు ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానని సవాలు విసిరిన కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

Also Read: India First-Ever Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు వచ్చేసింది.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

విశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు, టీడీపీ వలసనేత వాసుపల్లి గణేశ్‌ మధ్య లడాయి తీవ్రస్థాయికి చేరింది. సీతంరాజుకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సమన్వయకర్త పదవికి గణేశ్‌ ఇటీవల రాజీనామా చేశారు. గణేశ్‌ వ్యవహారాన్ని తాడేపల్లి ప్యాలెస్‌ సీరియ్‌సగా తీసుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ జిల్లాల్లో అయితే….
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరినీ తాడేపల్లి ప్యాలె్‌సకు రప్పించి చర్చలు జరిపిన తర్వాత స్తబ్దుగా ఉంది. అయితే ఇది ఎంతకాలం అనే చర్చ వైసీపీలో జరుగుతోంది.కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అమీతుమీకి సిద్ధపడ్డారు.

Anil Kumar Yadav, Kakani Govardhan

తీవ్ర పదాలతో ఇద్దరూ విమర్శలు చేసుకొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ గెలిచిన వంశీ, అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వంశీ, యార్లగడ్డ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వీరిద్దరి మధ్య రచ్చ రోడ్డెక్కడంతో జోక్యం చేసుకునేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇంతకాలం పార్టీని మోస్తోన్న వెంకట్రావును సమర్థించాలా? లేదంటే శాసనసభ్యుడిగా ఉన్న వంశీని సమర్థించాలా? అనేదానిపై తాడేపల్లి ప్యాలెస్‌ స్పష్టతకు రాలేకపోతోందని చెబుతున్నారు. అయితే, సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీని సమర్థిస్తే.. భవిష్యత్తు ఎన్నికల సమయంలో అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఆయన వైసీపీకి ఎదురు తిరిగితే ఎలా అనే సందేహాలూ ఉన్నాయని అంటున్నారు. మరో ఆరు నెలల్లో పార్టీ పరమైన సర్వే చేయనున్నందున, ఆతర్వాతే దీనిపై స్పష్టత ఇద్దామనే యోచనలో అధిష్ఠానం ఉందంటున్నారు.

బాలశౌరి వర్సెస్‌ పేర్ని

మచిలీపట్నంలో లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ప్రత్యక్ష యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన వీరిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇది బాహాటంగా బూతులు తిట్టుకునే స్థాయికి చేరింది. పరిస్థితి ఇంతగా దిగజారుతుందని వైసీపీ అధిష్ఠానం కూడా గుర్తించలేకపోయింది. సద్దుమణిగే పరిస్థితి కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో అధిష్ఠానం పడింది. తమ వద్దకు వచ్చి చర్చలు జరిగేదాక మౌనం దాల్చాలని, నిందారోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటూ ఇద్దరినీ తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశించింది.

Also Read:Governor Tamilisai- KCR: కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. ఓ అజ్ఞాత ఐఏఎస్.. లొల్లి ముదిరిందిలా!

Tags