Site icon OkTelugu

NIA Arrests Foreign Spies In India: భారత్ లో అమెరికన్, ఉక్రెయిన్‌ గూఢచారుల అరెస్ట్.. వెలుగులోకి వీళ్ల రహస్య ఆపరేషన్

NIA Arrests Foreign Spies In India

NIA Arrests Foreign Spies In India

NIA Arrests Foreign Spies In India: భారత దేశంలో ఎన్‌ఐఏ మన దేశంలో ఉన్న వ్యతిరేక శక్తులను గుర్తిస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాతోపాటు మనకు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదులు, ఏజెంట్లు, గూఢచారులపై నిఘా పెడుతుంది. అనుమానితులను అదుపులోకి తీసుకుంటుంది. తాజాగా కోల్‌కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్‌ పోర్టులలో ఏడుగురిని అరెస్టు చేసింది. ఇందులో ఒకరు అమెరికన్, ఆరుగురు ఉక్రెయిన్‌ వాసులు. అమెరికన్‌ పేరు మాథ్యూ వాండైక్‌. వీరిపై యూఏపీఏ కేసు నమోదు చేసి జైల్లో పెట్టింది. ఒక అమెరికా ఏజెంటు భారత్‌లో పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ఉంటూ చేపట్టిన ఆపరేషన్‌ షాక్‌కు గురిచేస్తుంది.

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

సీక్రెట్‌ ఆపరేషన్‌..
మాథ్యూ వాండైక్, వరల్డ్‌ లిబర్టీ ఆర్గనైజేషన్‌ నడిపించే డాక్యుమెంటరీ మేకర్‌. తాను వివిధ యుద్ధాల్లో అమెరికా సైన్యం తరఫున పాల్గొన్నట్లు చెప్పుకుంటూ వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాడు. షూటింగ్‌లు చేస్తున్నాడు. తన సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నాడు. అయితే ఇతనితోపాటు ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు మిజోరామ్‌లోని నిషేధిత ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్‌లో పర్యటించడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా మేఘాలయ ద్వారా మయన్మార్‌కు మార్గం తీసుకుని మయన్యామర్‌లోని ఈశాన్య భారత వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

మయన్మార్‌లో రేజీమ్‌ ఛేంజ్‌ కోసమే..
2021 మయన్మార్‌లో సైనికులు తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షురాలిని గద్దెదించారు. సైనికాధికారి ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు మయన్మార్‌ ప్రశాతంగానే ఉంది. కానీ మిలటరీ పాలన నచ్చని అమెరికా, యూరప్‌ దేశాలు మళ్లీ రెజీమ్‌ ఛేంజ్‌కు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో రెజీమ్‌ ఛేంజ్‌ జరిగింది. అదే తరహాలో మయన్మార్‌లో మిలటరీ పాలనకు స్వస్తి పలకాలని అమెరికా రహస్య ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఐఏ ఏజెంట్‌ అయిన మాథ్యూవాండైక్‌ను భారత్‌కు పంపిణ గూఢచర్యం చేస్తున్నట్లు తెలిసింది.

డ్రోన్‌ శిక్షణ ఇచ్చేందుకు..
ప్రస్తుతం ఏ యుద్ధం జరిగినా డ్రోన్‌ వార్‌ కీలకం అవుతోంది. తక్కువ ఖర్చుతో పెద్ద టార్గెట్‌లను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాథ్యూ వాండైక్‌ కూడా ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురి సహాయంతో మయన్మార్‌లోని అక్కడి పాలకుల వ్యతిరేకలతో చేతులు కలిపింది. వారికి డ్రోన్‌ వినియోగంలో శిక్షణ ఇచ్చి.. అదను చూసి రెజీమ్‌ ఛేంజ్‌ ఆపరేషన్‌ చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా మౌనం..
మాథ్యూ వాండైక్‌ అరెస్టుపై అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ‘పూర్తి వివరాలు తెలుసుకుని స్పందిస్తాం‘ అని ప్రకటించింది. అంతకుమించి ఒక్కమాట మాట్లాడడం లేదు. ఇక ఉక్రెయిన్‌ తమ పౌరులు తెలియకుండా వచ్చారని చెప్పింది. వదిలేయాలని కోరింది. కానీ వీరి కార్యకలాపాలే అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

భారత్‌ను విదేశీయులు మయన్మార్‌ ఆపరేషన్‌ బేస్‌గా వాడటం లిబియా లాంటి మునుపటి ఘటనలను గుర్తుచేస్తోంది. మిజోరామ్, మేఘాలయ వంటి సున్నిత ప్రాంతాల్లో డ్రోన్‌ చర్యలు సరిహద్దు భద్రతకు ముప్పు అని ఎన్‌ఐఏ భావిస్తోంది. ఎన్‌ఐఏ చర్యలు భారత్‌ విదేశీ జోక్యానికి గట్టి స్పందనగా మారాయి.

Exit mobile version