Agnipath Protest in Secunderabad: అగ్నిపథ్ విషయంలో తలెత్తిన వివాదంతో చెలరేగిన విధ్వంసం తెలిసిందే. ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరుద్యోగులు సృష్టించిన గొడవతో జరిగిన నష్టంతో పోలీసులు నిందితుల గుర్తింపుపై దృష్టి సారించారు. అగ్నిపథ్ నియామకాల్లో కేంద్రం పారదర్శకత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైళ్లకు నిప్పు పెట్టి తీవ్ర నష్టం కలిగించారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. నిరుద్యోగులను రెచ్చగొట్టడంతో వారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించడం వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. వారి వెనుక ఉండి నడిపించిన గాడ్ ఫాదర్ పై ప్రత్యక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇదివరకే పలు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకుల ప్రోద్బలంతోనే ఈ విధ్వంసం కొనసాగినట్లు తెలుసుకున్నారు. దీంతో దీనికి సంబంధించిన నిందితులుగా గుర్తించి కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వాట్సాప్ సందేశాల ద్వారా అందరికి పంపించి వారిలో ఉద్వేగం నింపి గొడవకు దిగేందుకు కారకులైనట్లు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడిగా మధుసూదన్ ను అరెస్టు చేశారు. అతడు అందించే సమాచారంతో కేసులో ఇంకా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Online Ticket Issue: చిత్ర పరిశ్రమపై కత్తికట్టిన ఏపీ సర్కారు.. కారణం అదేనా?
అగ్నిపథ్ విషయంలో రాజకీయ విద్వేషాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రప్రభుత్వమే దీనికి ప్రధాన కారకంగా కేంద్రం విమర్శలు చేసింది. దీనిపై టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది. తమకు సంబంధం లేదని బుకాయించింది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ గొడవలపై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. కారకులను గుర్తించి వారికి శిక్షలు పడేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా దాదాపు పదకొండు మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. గొడవలో ప్రధాన కారకుల గురించి కొన్ని విషయాలు తెలియడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించి నిందితులపై కేసులు పెట్టి శిక్షలు పడేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Pavan Kalyan: జగన్, బాబులను బీట్ చేయాలంటే పవన్ ఏం చేయాలి..?