AP CM YS Jagan: ‘పరిశుభ్రతకు పెద్దపీట వేయండి. పట్టణాలు, నగరాల సుందరీకరణకు ప్రాధాన్యమివ్వండి. పారిశుధ్య కార్మికులు బాధ్యతతో పనిచేయాలి. వారి బాధను చూసి చలించిపోయే కదా వేతనాన్ని రూ.18 వేలకు పెంచం. అందుకే వారి పట్ల కఠినంగా ఉండండి. పనిచేస్తారా? లేదా చస్తారా? అన్నట్టు వారితో పారిశుధ్య పనులు చేయించండి’… అంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను దేశించారు. సోమవారం రహదారులు, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులతో జరిపిన సమీక్షలో కీలక వ్యాఖ్యానాలు చేశారు. ఈ ఏడాది జూలై 15 నాటికి రాష్ట్రంలో రోడ్లపై గోతులు లేకుండా మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో 16762 రోడ్లకు సంబంధించి 4396 కి.మీ మేర రోడ్లు నిర్మాణం కోసం రూ.1826.22 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. వాటితో పాటు రోడ్లపై గోతులు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు.
నీటి శుద్ధిపై..
కృష్ణా, గోదావరి నదులు వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితమవుతున్నాయని, శుద్ధి చేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలని సీఎం సూచించారు.ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి సదుపాయాలున్నాయి?, ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రజారోగ్యంలో సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. పంటకాల్వల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, పరిశు రఽభతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మ్యాపింగ్ చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలన్నారు.
ఎయిర్ పోర్టుల్లో పచ్చదనం..
జగనన్న హరిత నగరాల కార్యక్రమంపై సీఎం సమీక్షిస్తూ ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను, గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌ప్స ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని, అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఆర్‌డీఏ కింద పనుల ప్రగతి సమీక్షలో కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని, క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, సీడ్‌యాక్సిస్ రోడ్లలో 4గ్యాప్స్‌ను పూర్తి చేసే పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ సమీర్‌శర్మ, ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్మార్ట్స్ సిటీలపై..
పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని., రాష్ట్రంలో ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు. ఇందులో సిబ్బంది పాత్ర అత్.. ఆ ఉద్దేశంతోనే మనం జీతాలు పెంచామన్నారు. వారు చేస్తున్న పనులను చూసి, చలించి వారికి రూ.18వేల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చామన్నారు.ప్రతి నియోజకవర్గంలో కూడా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ ప్రారంభం కావాలన్న సీఎం.., నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక సీఆర్డీఏ కింద పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్న అధికారులు.., క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. సీడ్‌యాక్సిస్ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ను పూర్తిచేసే పనులు మొదలవుతాయని చెప్పారు.
Also Read:AP Govt Free Electricity Scheme: ఏపీలో ఉచిత విద్యుత్ కు తూట్లు.. రైతులతో బలవంతపు సంతకాలు అందుకేనా?