https://oktelugu.com/

మళ్ళీ లాక్ డౌన్?

కరోనా వైరస్‌ విజృంభణతో యావత్ భారతావని వణికిపోతోంది. దేశంలో ఈ కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఆ సమయంలో వైరస్‌ ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు స్వచ్చందంగా లాక్ డౌన్ చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులను చేపడుతూనే తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మళ్లీ లాక్‌ డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు,  అసోంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లొ వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా మరోసారి లాక్‌ డౌన్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 08:07 PM IST
    Follow us on

    కరోనా వైరస్‌ విజృంభణతో యావత్ భారతావని వణికిపోతోంది. దేశంలో ఈ కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఆ సమయంలో వైరస్‌ ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు స్వచ్చందంగా లాక్ డౌన్ చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులను చేపడుతూనే తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మళ్లీ లాక్‌ డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తున్నాయి.

    మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు,  అసోంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లొ వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా మరోసారి లాక్‌ డౌన్‌ విధిస్తున్నాయి. ఈ సమయంలో దాదాపు అన్నిప్రాంతాల్లో వ్యవసాయ పనులు, అత్యవసర సర్వీసులు, సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో అటు కేసీఆర్, ఇటు జగన్ కూడా లాక్ డౌన్ కే మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం.

    ఇదిలా ఉంటే.. దేశంలో 135 కోట్ల జనాభాలో ప్రతి పదిలక్షల మందికి 727.4 కొవిడ్‌-19 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు ఎన్ని కేసులో తీసుకుంటే భారత్‌లో 4-8 రెట్లు తక్కువేనని పేర్కొంది. శుక్రవారం నాటికి ఉన్న యాక్టివ్‌ కరోనా బాధితుల సంఖ్య 3,42,756 మాత్రమేనని వెల్లడించింది. 6.35 లక్షల కన్నా ఎక్కువ మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.