https://oktelugu.com/

బన్నీ, కొరటాల కాంబో ఫిక్స్‌ అయినట్టేనా!

చేసింది నాలుగు సినిమాలే అయినా అన్నీ బ్లాక్‌ బస్టర్స్‌ కావడంతో టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల జాబితాలో చేరాడు కొరటాల శివ. అంతకుముందే రైటర్ మంచి పేరు తెచ్చుకున్న శివ.. సెన్సిబుల్‌ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. సామాజిక, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఆయన.. తన ప్రతీ సినిమాలో ఓ సోషల్‌ మెసేజ్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. పది బ్లాక్‌బస్టర్ హిట్స్‌ సాధించడమే తన కల అని చెప్పే శివ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ‘ఆచార్య’ పేరుతో తెరకెక్కుతున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 08:08 PM IST
    Follow us on


    చేసింది నాలుగు సినిమాలే అయినా అన్నీ బ్లాక్‌ బస్టర్స్‌ కావడంతో టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల జాబితాలో చేరాడు కొరటాల శివ. అంతకుముందే రైటర్ మంచి పేరు తెచ్చుకున్న శివ.. సెన్సిబుల్‌ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. సామాజిక, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఆయన.. తన ప్రతీ సినిమాలో ఓ సోషల్‌ మెసేజ్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. పది బ్లాక్‌బస్టర్ హిట్స్‌ సాధించడమే తన కల అని చెప్పే శివ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ‘ఆచార్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని అటు చిరు, ఇటు శివ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు బడా నిర్మాత అల్లు అరవింద్‌ వారసుడిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌ ఎంతో కష్టపడుతూ, ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఫస్ట్‌ మూవీ గంగోత్రిలో నిక్కర్లు వేసుకొని నటించినా… తన సెకండ్‌ మూవీ ఆర్యతోనే తన బాడీ, బాడీ లాంగ్వేజ్‌ మార్చుకొని యూత్‌ స్టార్గా మారిపోయాడు. ఆపై, వైవిధ్యభరిత కథలు ఎంచుకుంటూ ఎన్నో హిట్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో మరో భారీ హిట్‌ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’లో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది.

    సినిమా వాళ్లకు ఒక పీడకల !

    అటు ‘ఆచార్య’ షూటింగ్‌ కూడా నిలిచిపోగా…. ఇప్పుడప్పుడే మళ్లీ చిత్రీకరణ మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో, బన్నీ, కొరటాల తమ తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ ఖరారైందని సమాచారం. వాస్తవానికి కొరటాల ‘ఆచార్య’ తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేస్తాడని, కాదు మరో హీరోకు కమిట్మెంట్‌ ఇచ్చాడని వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదని తేలింది. శివ తన తర్వాతి సినిమాని బన్నీతో ఫిక్స్ చేశాడని టాలీవుడ్‌ తాజా సమాచారం. బన్నీ కూడా ‘పుష్ప’ పూర్తయిన తర్వాత శివ, ఆపై మరోసారి త్రివిక్రమ్‌తో మూవీ చేస్తాడని చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌ సంగతి పక్కబెడితే.. మరికొన్ని రోజుల్లోనే బన్నీ, శివ కలయికలో సినిమాపై అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది. అదే జరిగితే మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయినట్టే.