https://oktelugu.com/

జగన్ ను విలన్ ను చేసేది వారేనట?

ఏపీ సీఎం జగన్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 90శాతం హామీలు నెరవేర్చాడు. నవరత్నాలు అమలు చేశాడు. హామీ ఇవ్వని వాటిని అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేలకు వేలు అకౌంట్లలో వేస్తూ ప్రజల ఆదరాభిమానులు చూరగొంటున్నారు. అయినా వ్యతిరేకత వ్యాపిస్తోంది. ప్రతీదాంట్లోనే ప్రత్యర్థులకు ఉప్పందుతోంది. లోపాలు ప్రత్యర్థులకు వరంగా మారుతున్నాయి. ప్రజల్లో ఉన్న సానుకూలత.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా ప్రబలుతోందని ఆరాతీసిన ఏపీ సీఎంవో విచారణలో షాకింగ్ విషయం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2020 / 07:52 PM IST
    Follow us on


    ఏపీ సీఎం జగన్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 90శాతం హామీలు నెరవేర్చాడు. నవరత్నాలు అమలు చేశాడు. హామీ ఇవ్వని వాటిని అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేలకు వేలు అకౌంట్లలో వేస్తూ ప్రజల ఆదరాభిమానులు చూరగొంటున్నారు. అయినా వ్యతిరేకత వ్యాపిస్తోంది. ప్రతీదాంట్లోనే ప్రత్యర్థులకు ఉప్పందుతోంది. లోపాలు ప్రత్యర్థులకు వరంగా మారుతున్నాయి. ప్రజల్లో ఉన్న సానుకూలత.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా ప్రబలుతోందని ఆరాతీసిన ఏపీ సీఎంవో విచారణలో షాకింగ్ విషయం బయటపడిందని తెలిసింది.

    అధికార పార్టీకి చెందిన సీనియర్ వైసీపీ నేతలే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం వెనుక ఉన్నారని.. గతంలో టీడీపీలో ఉన్న వీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం దక్కలేదనే అక్కసుతోనే ఇలా ప్రచారం చేయిస్తున్నారని ఏపీ సీఎం జగన్ విచారణలో తేలిందని సమాచారం.

    ఆ టాప్ పత్రికను బీజేపీ ఎందుకు కొంటుంది?

    వైసీపీ అధికారంలోకి రాగానే ఎంతో మంది సీనియర్లను పక్కనపెట్టిన జగన్ సామాజిక న్యాయాన్ని తెరమీదకు తీసుకొచ్చి ఏకంగా ఐదుగురు ఎస్సీలకు.. అనుభవం లేని బీసీలు, మైనార్టీ ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్లో చోటు కల్పించి మంత్రిపదవులు ఇచ్చారు. రెడ్డిలకే పదవులు ఇస్తే అంతా రెడ్డి రాజ్యం అంటారనే అపవాదు వస్తుందనే కారణంగా జగన్ ఇలా అందరు సీనియర్లు, రెడ్డిలకు చాన్స్ ఇవ్వలేదు. ఫైర్ బ్రాండ్స్ లాంటి రోజా, ధర్మాన, ఆళ్ల రామకృష్ణరెడ్డి, అంబటి రాంబాబు, కరుణాకర్ రెడ్డి, ఆనం, శిల్పా చక్రపాణి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టారు.

    అయితే ఇందులో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ పై కోపంగా ఉన్నారని సీఎంవో గుర్తించిదట.. ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లకు సైతం మంత్రి పదవిని జగన్ ఇవ్వలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉండి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా లీకులు అందిస్తూ వ్యతిరేక ప్రచారం సాగేలా వ్యవహరిస్తున్నారని విచారణలో తేలింది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, శిల్పా చక్రపాణి లాంటి నేతలు జగన్ పై వ్యతిరేకంగా గళమెత్తారు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారని తెలిసిందని సమాచారం.

    మాస్కులు పెట్టుకోలేదని కోటి ఫైన్..!

    పేదలకు ఇళ్ల పథకం.. ఎంపిక చేసిన భూముల విషయంలో అవకతవకలపై వ్యతిరేక మీడియాకు సదురు వైసీపీ సీనియర్లే ఉప్పందించారని ప్రభుత్వానికి తెలిసిందట.. వీరి విషయంలో ఏం చేయాలనే దానిపై జగన్ అండ్ వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసినట్టు సమాచారం. త్వరలోనే చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

    -ఎన్నం