కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్… ఆ ఆదేశాల వెనుక తృణమూల్‌ కాంగ్రెస్

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించమని కేంద్ర ఆరోగ్యశాఖను ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిసింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కాదు.. త్వరలో ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయాలని పేర్కొంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆదేశించినట్లు ది ప్రింట్ తెలిపింది. ఈ కొత్త ఆదేశం వెనక తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ […]

Written By: Srinivas, Updated On : March 6, 2021 12:13 pm
Follow us on


కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించమని కేంద్ర ఆరోగ్యశాఖను ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిసింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కాదు.. త్వరలో ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయాలని పేర్కొంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆదేశించినట్లు ది ప్రింట్ తెలిపింది. ఈ కొత్త ఆదేశం వెనక తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మ ఉండటం.. ఎన్నికల కోడ్ నియమాల ఉల్లంఘనే అని అక్కడి ఎన్నికల సంఘానికి మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కంప్లైంట్ ఇవ్వడంతో.. అది కాస్త గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.

Also Read: బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టే ప్లాన్ ఇదే..

అందులోభాగంగానే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తృణమూల్ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న రాష్ట్ర సీఈ.. ఈ కంప్లైంట్ పైనా ఫోకస్ పెట్టనుంది. తాజా ఆదేశంతో తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో.. కరోనా వ్యాక్సినేషన్ (వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఇచ్చే సర్టిఫికెట్)లను మార్చాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికారిక యంత్రాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తృణమూల్ ఆరోపించింది.

Also Read: మమతా బెనర్జీ సంచలనం..తొడగొట్టింది.. 291మందితో బరిలోకి..

‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అని అందరికీ తెలుసు. ఓ రాజకీయ నేతగా.. ఆయన తన పార్టీ ర్యాలీలకు మద్దతు కోరవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఫొటోను కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ముద్రించడం వల్ల ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుంది’ అని బెంగాల్ మంత్రి, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హాకిమ్ అన్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

కరోనా వ్యాక్సిన్ ద్వారా కూడా మోదీ క్రెడిట్ కొట్టేయాలని యత్నిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నింటినీ ఆధార రహితమైనవిగా బీజేపీ కొట్టిపారేసింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం… ఎన్నికల ప్రకటనకు ముందే ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్లో మార్పులు అవసరం లేద అని సమర్థించుకుంది. అయితే.. ఈసీ ఆదేశాలతో ఇప్పుడు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో కనిపించదు.