https://oktelugu.com/

వైసీపీకి హైకోర్టు షాక్‌.. వారి సెల్‌ఫోన్లు అధికారులకు ఇవ్వాల్సిందే..

ఏపీలో ఇప్పటికే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రభుత్వంలో నియమించిన వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్‌ ఫోన్ల సాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ప్రయత్నాలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌ చెక్‌ పెట్టింది. ఎన్నికల సమయంలో అధికారుల వద్ద సెల్‌ఫోన్లు డిపాజిట్‌ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై సింగిల్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 6, 2021 / 12:02 PM IST
    Follow us on


    ఏపీలో ఇప్పటికే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్రభుత్వంలో నియమించిన వార్డు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్‌ ఫోన్ల సాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ప్రయత్నాలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌ చెక్‌ పెట్టింది. ఎన్నికల సమయంలో అధికారుల వద్ద సెల్‌ఫోన్లు డిపాజిట్‌ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ సవరించింది. దీంతో ప్రభుత్వానికి వార్డు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోక తప్పడం లేదు.

    Also Read: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ మరో బంపర్ గిఫ్ట్

    ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న వైసీపీ సర్కార్‌‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న వార్డు వాలంటీర్ల సెల్‌ఫోన్ల వాడకం ద్వారా ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందకుండా ప్రత్యర్థి పార్టీల ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల సెల్‌ఫోన్లను ఎన్నికలు ముగిసేవరకూ అధికారుల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లో సవాల్ చేసిన ప్రభుత్వానికి ఊరట లభించినా డివిజన్ బెంచ్‌లో చుక్కెదురైంది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న వార్డు వాలంటీర్లు విధిగా తమ మొబైల్‌ ఫోన్లను ఉన్నతాధికారులకు అప్పగించాల్సిందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిన్న తీర్పు చెప్పింది.

    Also Read: ఏడాదిగా జీతాల్లేవు.. హెచ్.ఆర్.సీని ఆశ్రయించిన ఆ పత్రిక ఉద్యోగులు

    గతంలో సెల్‌ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదంటూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ పక్కనబెట్టింది. దీంతో వాలంటీర్ల సెల్‌ఫోన్ల వ్యవహారంపై ఎస్ఈసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ హైకోర్టుకెళ్లిన ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలతో వార్డు వాలంటీర్లు తమ సెల్‌ఫోన్లను అధికారులకు అఫ్పగించేందుకు సిద్ధమవుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను అధికారుల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఇందులో తమ విధి నిర్వహణలో మొబైల్‌ ఫోన్‌ అవసరమని భావిస్తే అధికారులకు ఆ మేరకు వివరించి మొబైల్‌ ఫోన్‌ తీసుకునేందుకు వాలంటీర్లకు అవకాశం కల్పించింది. పని ముగిశాక తిరిగి మొబైల్ ఫోన్‌ను అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.