spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli Mahesh Babu Movie: మహేష్ - రాజమౌళి' సినిమా ...

SS Rajamouli Mahesh Babu Movie: మహేష్ – రాజమౌళి’ సినిమా ఎక్స్ క్లూజివ్ డిటైల్స్

SS Rajamouli Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది ? ఎలాగూ, “ఆర్ఆర్ఆర్” ఈ నెలాఖరున విడుదల కానుంది. అంటే వచ్చే నెల నుంచి రాజమౌళి ఫ్రీ అయిపోతాడు. మరి వెంటనే మహేష్ తో సినిమా స్టార్ట్ చేస్తాడా ? లేక, ఎప్పటిలాగే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటాడా ? ఇప్పటికి అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట.

SS Rajamouli Mahesh Babu Movie
SS Rajamouli Mahesh Babu Movie

కానీ,రాజమౌళి పూర్తి అయిన స్క్రిప్ట్ పై వర్క్ చేయడానికి ఆరు నెలలు టైం పెట్టుకున్నాడట. ఆ తర్వాత మహేష్ బాబు ఎప్పుడు డేట్స్ ఇవ్వగలడో తెలుసుకొని అప్పుడు సినిమా షూట్ ను ప్లాన్ చేస్తాడట. కాబట్టి.. ఇదంతా సెట్ కావాలంటే మరో ఏడాది అయినా పడుతుంది అంటున్నారు సినీ జనం. అందుకే, రాజమౌళి తన కెమెరామన్ సెంథిల్ ని వేరే సినిమా చేసుకోమని సలహా ఇచ్చాడు.

Also Read:  హీరో లక్ రివర్స్ అయ్యింది.. ఇక సైడ్ క్యారెక్టర్సే దిక్కు !

ప్రస్తుతం సెంథిల్ ఒక కన్నడ – తెలుగు చిత్రాన్ని టేకప్ చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా వస్తున్న సినిమాకి సెంథిలే కెమెరామెన్. ఎలాగూ మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి మరో ఏడాది సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు సినిమాను పూర్తి చేస్తాడట సెంథిల్. ఆ తర్వాత మహేష్ – రాజమౌళి సినిమా మీదకు రానున్నాడు. మొత్తమ్మీద మహేష్ – రాజమౌళి సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే.

ఇక మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో కథ రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారని.. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది.

SS Rajamouli Mahesh Babu Movie
SS Rajamouli Mahesh Babu Movie

మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట. కాబట్టి.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. అందుకే ఇండియన్ తెర పై ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం.

Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Oktelugu Epaper
Exit mobile version