https://oktelugu.com/

బీజేపీలో చేరేందుకు సినీ గ్లామర్ల క్యూ

సినీ స్టార్లకు అభిమానులు ఎక్కువ. ఆ అభిమానులతో అన్నో ఇన్నో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుంటాయి పార్టీలు. ముఖ్యంగా ఎన్నికల టైంలో స్టార్‌‌ క్యాంపెయినర్లుగా ప్రచారంలోకి తీసుకొస్తుంటారు. అయితే.. ఇప్పడు బీజేపీ కూడా సినీ గ్లామర్‌‌ను కోరుకుంటోంది. ఇందుకు మాజీ హీరోయిన్స్‌ను ఆకట్టుకుంటోంది. తమిళనాట ఒకనాటి హీరోయిన్ ఖుష్బూ 2020 లోనూ, తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తర్వాత రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోగా.. ప్రస్తుతం మరికొంతమంది హీరోయిన్స్ ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. Also Read: ఇండియాలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 / 12:41 PM IST
    Follow us on


    సినీ స్టార్లకు అభిమానులు ఎక్కువ. ఆ అభిమానులతో అన్నో ఇన్నో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుంటాయి పార్టీలు. ముఖ్యంగా ఎన్నికల టైంలో స్టార్‌‌ క్యాంపెయినర్లుగా ప్రచారంలోకి తీసుకొస్తుంటారు. అయితే.. ఇప్పడు బీజేపీ కూడా సినీ గ్లామర్‌‌ను కోరుకుంటోంది. ఇందుకు మాజీ హీరోయిన్స్‌ను ఆకట్టుకుంటోంది. తమిళనాట ఒకనాటి హీరోయిన్ ఖుష్బూ 2020 లోనూ, తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తర్వాత రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోగా.. ప్రస్తుతం మరికొంతమంది హీరోయిన్స్ ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.

    Also Read: ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..?

    ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని కలలు కంటున్నా వాణి విశ్వనాథ్‌ మొదట తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులవుతారని కథనాలు వచ్చాయి. ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆమె సైలెంట్‌ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకి కాషాయ కండు వా కప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.

    ప్రియరామన్ కూడా ఒకనాడు విజయవంతమైన హీరోయిన్. ప్రస్తుతం ఏం చేస్తోందో తెలీదు. కానీ.. హఠాత్తుగా ఆమె పేరు బీజేపీతో ముడిపెడుతూ ప్రచారంలోకి వచ్చింది. అర్చన అనే ఇంకో హీరోయిన్ కూడా అదే పార్టీలో చేరాలని కుతూహల పడుతున్నారు. తాను కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఉత్సాహపడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: హీటెక్కిస్తున్న బెంగాల్‌ రాజకీయాలు

    ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోయిన్స్ బీజేపీ నేత సత్యమూర్తిని కలుసుకుని తమ చేరిక విషయమై ప్రాథమికంగా చర్చించారట. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలిసిన తరువాత పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చని చెప్పారట. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయానికి ప్రచారం చేయాలంటూ సూచించారట. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి మున్ముందు బీజేపీలో సినీ గ్లామర్‌‌ పెరబోతోందన్నమాట.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్