https://oktelugu.com/

బర్డ్‌ ఫ్లూ కలకలం

అసలే కరోనా వైరస్.. అది తగ్గుముఖం పట్టిందనుకునే లోపే మళ్లీ కొత్త రకం స్ట్రెయిన్‌ వణికిస్తోంది. దీనికితోడు ఇప్పుడు మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆందోళను గురిచేసిన బర్డ్‌ఫ్లూ మళ్లీ జడలు విప్పింది. దీని ఫలితంగా ఆకాశంలో విహరించాల్సిన పక్షులు నేల రాలుతున్నాయి. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి. Also Read: ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..? మొన్న కేరళ, నిన్న రాజస్థాన్‌.. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌, […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 / 12:24 PM IST
    Follow us on


    అసలే కరోనా వైరస్.. అది తగ్గుముఖం పట్టిందనుకునే లోపే మళ్లీ కొత్త రకం స్ట్రెయిన్‌ వణికిస్తోంది. దీనికితోడు ఇప్పుడు మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. గతంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆందోళను గురిచేసిన బర్డ్‌ఫ్లూ మళ్లీ జడలు విప్పింది. దీని ఫలితంగా ఆకాశంలో విహరించాల్సిన పక్షులు నేల రాలుతున్నాయి. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.

    Also Read: ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..?

    మొన్న కేరళ, నిన్న రాజస్థాన్‌.. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ ఇలా ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు పాకింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 1700 పక్షులు చనిపోయాయి. కాంగ్రా జిల్లాలోని అభయరణ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో పక్షులు ప్రాణాలు కోల్పోవడం అక్కడ కలకలం రేపుతోంది. దీంతో వెంటనే అక్కడికి పర్యాటకులతో పాటు ఎవరూ వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాంగ్‌డామ్‌ సరస్సు చుట్టూ ఏం జరుగుతోందని నిఘా పెట్టింది. అంతేకాదు.. జిల్లాలో పౌల్ట్రీ కొనుగోళ్ల పైనా నిషేధం విధించారు అధికారులు.

    పౌల్ట్రీతో పాటు పక్షులు, చేపల వధను నిషేధించినట్లు తెలిపారు. బర్డ్‌ ఫ్లూ కారణంగానే పక్షులు మృత్యవాత పడొచ్చని అనుమానిస్తున్నారు. ఈ హెచ్‌5ఎన్‌1 ఇన్‌ఫ్లూయోంజా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనే కాదు.. అంతకుముందు కేరళలో కూడా బాతులు ఇలాగే చనిపోయాయి. అలప్పుజ, కొట్టాయంలో దాదాపు 12 వేల బాతులు మృత్యువాత పడ్డాయి. వీటిలో హెచ్‌5ఎన్‌8 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయోంజాను గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 36 వేల బాతులకు కూడా ఈ వైరస్‌ సోకినట్లు చెబుతున్నారు.

    Also Read: వ్యాక్సిన్ ఫైట్.. క్రెడిట్ కోసం పరువు తీసుకుంటున్నారు

    మరోవైపు.. రాజస్థాన్‌లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ కాకులు మృత్యువాతపడుతున్నాయి. చనిపోయిన కాకుల్లోనూ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయేంజా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 170 వరకు పక్షులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల ఈ రాష్ట్రంలోనే 425 పక్షులు మృత్యువాత పడ్డాయి. తాజాగా.. మరిన్ని చనిపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జలావర్‌ జిల్లాతోపాటు జైపూర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక మధ్యప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న జనాలకు.. పక్షులకు సోకుతున్న వైరస్‌ దడ పుట్టిస్తోంది. మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    Tags