భారత్ లో 58 కరోనా స్ట్రేయిన్ కేసులు: కేంద్ర ప్రభుత్వం

భారత్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నా కరోనా స్ట్రేయిన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. యూకే నుంచి దేశంలోకి వచ్చిన వారి నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 58 మందికి కరోనా స్ట్రేయిన్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. సాధారణ కరోనా కంటే కరోనా స్ట్రేయిన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని వైద్యఅధికారులు చెబుతున్నారు. ఇక కరోనా స్ట్రేయిన్ మొదటి కేసు నమోదైన బ్రిటన్లో తాజాగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో […]

Written By: Velishala Suresh, Updated On : January 5, 2021 12:49 pm
Follow us on

భారత్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నా కరోనా స్ట్రేయిన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. యూకే నుంచి దేశంలోకి వచ్చిన వారి నుంచి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 58 మందికి కరోనా స్ట్రేయిన్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. సాధారణ కరోనా కంటే కరోనా స్ట్రేయిన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని వైద్యఅధికారులు చెబుతున్నారు. ఇక కరోనా స్ట్రేయిన్ మొదటి కేసు నమోదైన బ్రిటన్లో తాజాగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పరిస్థతి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.