https://oktelugu.com/

Hero Vijay party Flag : హీరో విజయ్ పార్టీ జెండా ఏం సూచిస్తోంది.. ఆ రంగులు దేనికి సంకేతం.. ఏనుగులు ఎందుకు పెట్టాడు? ఫుల్ డీటైల్స్..

నటుడు, తమిళగ వెట్రికళగం విజయ్ తన పార్టీకి సంబంధించి జెండాను ఈ రోజు ఆవిష్కరించారు. మూడు రంగులు రెండు చిస్నాలతో ఉన్న జెండాలో ఏర్పాటు చేయించాడు. అవన్నీ దేనికి సంకేతమో వివరించాడు. అనంతరం పార్టీని ప్రభుత్వంలోకి తేవాలని తోజార్గల్ (కామ్రేడ్) అని సంభోదిస్తూ పిలుపునిచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 / 09:33 AM IST

    Hero Vijay party Flag

    Follow us on

    Hero Vijay party flag : తమిళ నటుడు, స్టార్ హీరో విజయ్ ఫిబ్రవరిలో పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి సంబంధించి జెండా ఎజెండా లాంటివి పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రకటించకపోవడంతో పోటీ చేయలేదు. తన పార్టీ జెండాను ఈ రోజు (ఆగస్ట్ 22) గురువారం ఆవిష్కరించారు. ఈ జెండాలో మూడు రంగులు ఒక పువ్వు, రెండు ఏనుగులు ఉన్నాయి. అసలు ఈ రంగులు, గుర్తులు దేనికి ప్రతీక అంటూ పార్టీ కేడర్ ప్రశ్నించడంతో వివరించారు విజయ్. ఎరుపు, పసుపు రంగులతో ఉన్న ఈ జెండాలో మధ్యలో ఒక పువ్వు (పుష్పం)ను పెట్టారు. పతాకంలో రెండు వైపులా ఏనుగులను ఉంచారు. జెండాలో కనిపిస్తున్న పువ్వు పేరు ‘వాగాయ్’. చోళ రాజులు, పాండ్య రాజులు పాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారిని ఈ పూలతోనే స్వాగతం పలికేవారట. అందుకే ఈ పూలని విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఇక పక్కన ఉన్న రెండు ఏనుగులు ప్రజాశక్తికి ప్రతీక అన్నమాట. విజయ్ పనైయూర్ లోని టీవీకే ప్రధాన కార్యాలయంలో తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగుల బ్యాండ్లతో కూడిన ఈ జెండాలో ప్రజాశక్తికి ప్రతీకగా రెండు యుద్ధ ఏనుగులు, విజయానికి ప్రతీకగా వాగై పువ్వు (పుష్పం)ను ఏర్పాటు చేశాడు. ఈ జెండాకు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉందని, పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణ ప్రణాళికలతో రానున్న రాష్ట్ర స్థాయి సదస్సులో వివరించాల్సి ఉందని విజయ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మా కోసం పని చేశాం. రాబోయే సంవత్సరాల్లో పార్టీగా తమిళనాడు కోసం, ప్రజల అభ్యున్నతికి అందరం కలిసి పని చేద్దాం, మద్దతుదారుల సమష్టి కృషిని ఆయన నొక్కి చెప్పారు. 22న విల్లుపురం జిల్లా విక్రావండిలో టీవీకే తొలి రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కేడర్ ను ‘తోజార్గల్’ (కామ్రేడ్స్) అని సంబోధించిన విజయ్, టీవీకే కార్యకర్తలు, తమిళనాడు ప్రజల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ‘నేను దీన్ని కేవలం పార్టీ జెండాగా చూడను. బదులుగా, నేను దీన్ని తమిళనాడు భవిష్యత్ తరాల విజయానికి గుర్తు జెండాగా చూస్తాను. నేను చెప్పకుండానే మీరు మీ ఇళ్లలో, హృదయాల్లో జెండాలు ఎగురవేస్తారని నాకు తెలుసు’ అని విజయ్ సభికుల కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. పార్టీ సభ్యులు జెండాలు పట్టుకుని ఆనందించాలని, గెలుపు ఖాయమని ధీమాగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జెండా ఎగురవేసేటప్పుడు అవసరమైన అనుమతులు పొందాలని, నిబంధనలు పాటించాలని కోరారు.

    అంతకు ముందు విజయ్ పార్టీ సభ్యులకు ప్రతిజ్ఞ చేయించారు. భారత స్వాతంత్య్రం, తమిళనాడు హక్కుల కోసం పోరాడిన తమిళనాడుకు చెందిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ ప్రతిజ్ఞ చేశారు. తమిళ భాష అమరవీరులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసేందుకు పార్టీ శ్రేణులు కట్టుబడి ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగం, సార్వభౌమాధికారంపై విశ్వాసం ఉంచి బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరిస్తానని, ఐక్యత, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, సమానత్వాన్ని కాపాడుతానని చెప్పారు.

    ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం మార్గంలో ప్రయాణిస్తానని, ప్రజా సేవకుడిగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కులం, మతం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా విభేదాలను తొలగించేందుకు, సమానత్వ సూత్రాలను నిలబెట్టడానికి కృషి చేస్తామని టీవీకే ప్రతిజ్ఞ చేసింది.

    ఈ కార్యక్రమానికి నటుడు విజయ్ తల్లిదండ్రులు సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ గీతం ‘తమిళన్ కోడి పరాక్కుతు, తలైవన్ ఉగమ్ పిరక్కుతు’ (తమిళ జెండా ఎగురుతుంది; నాయకుడి శకం ప్రారంభమవుతుంది) అని వారు విడుదల చేసినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కు నివాళులు అర్పించారు. ఫిబ్రవరి, 2024లో విజయ్ పార్టీని ప్రారంభించారు. విజయ్.