https://oktelugu.com/

ABP C-VOTER సర్వే : ఏపీ, తెలంగాణల్లో ఎవరికి ఎన్ని సీట్లంటే?

అయితే ఈసారి ఎన్నికల్లో 2019 నాటి మ్యాజిక్ పునరావృతం కాదని ఏబీపీ సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు, వైసిపికి ఐదు సీట్లు లభిస్తాయని ఏబిపి సీ ఓటర్ సర్వే ప్రకటించింది. ఎన్డీఏ కూటమికి 47%, వైసిపి కి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం , ఇతరులకు 11 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2024 9:28 pm
    ABP C-VOTER Survey AP and Telangana

    ABP C-VOTER Survey AP and Telangana

    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.. ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ప్రచారాలనూ కొత్త పుంతలను తొక్కిస్తున్నారు.. ఇక మీడియా, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరస్పరం దుమ్ము ఎత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏపీలో ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి 2019 నాటి మ్యాజిక్ ప్రదర్శిస్తుందా? ఎన్డీఏ కూటమి అక్కడ సత్తా చాటుతుందా? ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటి హవాను కొనసాగిస్తుందా? బిజెపి అనుకున్న స్థాయిలో సీట్లు సాధిస్తుందా? భారత రాష్ట్ర సమితి తిరిగి పుంజుకుంటుందా? అనే అంశాలపై ప్రఖ్యాత ABP C-VOTER సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు సంచలన అంశాలను ఆ సంస్థ ప్రకటించింది.

    తెలంగాణలో..

    తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి 9, కాంగ్రెస్ మూడు, భారతీయ జనతా పార్టీ నాలుగు, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10, ఎన్డీఏ కూటమిన్ఐదు, భారత రాష్ట్ర సమితికి ఒకటి, ఎంఐఎం కు ఒక స్థానం దక్కించుకుంటాయని ABP C-VOTER సర్వే లో తేలింది. ఇక ఓట్ల శాతం విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ 42%, ఎన్డీఏ 26%, భారత రాష్ట్ర సమితి 27%, ఎంఐఎం రెండు శాతం ఓట్లను దక్కించుకుంటాయని తేలింది.

    ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో అప్పటి వైసిపి 22 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. వైసిపి గత ఎన్నికల మాదిరిగానే ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో 2019 నాటి మ్యాజిక్ పునరావృతం కాదని ఏబీపీ సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు, వైసిపికి ఐదు సీట్లు లభిస్తాయని ఏబిపి సీ ఓటర్ సర్వే ప్రకటించింది. ఎన్డీఏ కూటమికి 47%, వైసిపి కి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం , ఇతరులకు 11 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది.