UPSC : యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

గతేడాది మే 28న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. వీటిలో ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి

Written By: NARESH, Updated On : April 16, 2024 9:33 pm

UPSC final results

Follow us on

UPSC : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూసీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ – 2023 తుది ఫలితాలు మంగళవారం(ఏప్రిల్‌ 16న) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవ తుది ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించాడు. అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, తెలుగమ్మాయి అనన్యరెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు.

1,016 మంది ఎంపిక..
సివిల్స్‌-2023 ద్వారా ఆ ఏడాదికి 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 115 మంది, ఓబీసీ కోటాలో 303 మంది, ఎస్సీ కోటాలో 165, ఎస్టీ కోటాలో 86 మందిని ఎంపిక చేశారు. పోస్టుల వారీగా పరిశీలిస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మందిని ఎంపిక చేశారు. ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఏ కేటగిరీ కింద 613 మందిని, గ్రూప్‌-బి కేటగిరీలో 113 మంది ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.

మే 28న ప్రిలిమ్స్‌…
గతేడాది మే 28న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. వీటిలో ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకూ ఇంటర్వ్యూలు జరిగాయి. వీటి తర్వాత ఫైనల్‌గా ఎంపికైన వారి జాబితా మంగళవారం ప్రకటించారు. తుది ఫలితాలు కమిషన్ రెండు వెబ్ సైట్లు upsc.gov.in, upsconline.nic.inలో అందుబాటులో ఉన్నాయి.

తెలుగువారు సాధించిన ర్యాంకులు ఇవీ..
దోనూరు అనన్యరెడ్డి 3వ ర్యాంకు
నందల సాయికిరణ్‌ 27వ ర్యాంకు
మేరుగు కౌశిక్‌ 22వ ర్యాంకు
పెంకీసు ధీరజ్‌రెడ్డి 173వ ర్యాంకు
జి.అక్షయ్‌ దీపక్‌ 196వ ర్యాంకు
గనసేన భానుశ్రీ 198వ ర్యాంకు
నిమ్మనపల్లి ప్రదీప్‌రెడ్డి 382వ ర్యాంకు
బన్న వెంకటేష్‌ 467వ ర్యాంకు
పూల ధనుష్‌ 480వ ర్యాంకు
కె.శ్రీనివాసులు 526వ ర్యాంకు
నెల్లూరు సాయితేజ 558వ ర్యాంకు
పి.భార్గవ్‌ 590వ ర్యాంకు
కె.అర్పిత 639వ ర్యాంకు
ఐశ్వర్య నెల్లి శ్యామల 649వ ర్యాంకు
సాక్షి కుమారి 679వ ర్యాంకు
చౌహన్‌ రాజ్‌కుమార్‌ 703వ ర్యాంకు
జి.శ్వేత 711వ ర్యాంకు
వి.ధనుంజయకుమార్‌ 810వ ర్యాంకు
లక్ష్మీ భానోతు 828వ ర్యాంకు