https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ కి రహస్యంగా గిఫ్ట్ పంపిన వేణు స్వామి భార్య.. మళ్ళీ కావాలని అడగడంతో మేటర్ లీక్!

ఈ సీతాఫలాలు ఎవరికీ పంపుతున్నానో తెలుసా మన డార్లింగ్ ప్రభాస్ కి. ప్రతి సంవత్సరం తాము పండించిన సీతాఫలాలు కొంతమందికి పంపుతాము. అలా ఓ స్పెషల్ పర్సన్ కి ఫలాలు పంపిస్తే ఆయన దగ్గర నుంచి అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2024 / 08:28 PM IST

    Venu Swamy's wife Veena Srivani

    Follow us on

    Prabhas – Venu Swamy : వీణా శ్రీవాణి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య. ఆమెకు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన వీణ శ్రీవాణి యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. సినిమా పాటలు, భక్తి గీతాలు తన వీణ పై వాయిస్తూ వాణి శ్రీవాణి అందరినీ ఆకట్టుకుంటుంది. వీణా శ్రీవాణిని సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.

    పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీణ వాయించి మరింత ఫేమస్ అయింది. ఈ మధ్య భర్త వేణు స్వామితో కలిసి రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఈ జంట సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నారు. అయితే తాజాగా వీణ శ్రీవాణి షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె ప్రభాస్ కోసం ఓ మధురమైన గిఫ్ట్ పంపారు. వీణ శ్రీవాణి తన ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపించారు.

    ఈ సీతాఫలాలు ఎవరికీ పంపుతున్నానో తెలుసా మన డార్లింగ్ ప్రభాస్ కి. ప్రతి సంవత్సరం తాము పండించిన సీతాఫలాలు కొంతమందికి పంపుతాము. అలా ఓ స్పెషల్ పర్సన్ కి ఫలాలు పంపిస్తే ఆయన దగ్గర నుంచి అవి ప్రభాస్ వద్దకు చేరాయి. ఈ క్రమంలో ప్రభాస్ కి సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని అడిగారని వాణి శ్రీవాణి ఆ వీడియో వెల్లడించారు.

    ప్రభాస్ అడిగితే ఎవరైనా పంపించకుండా ఉంటారా .. అందుకే ఈ బాస్కెట్ లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సంవత్సరం ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపుతానని వీణ శ్రీవాణి అన్నారు. ఇంకా ఓ స్పెషల్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ కూడా పంపుతున్నట్లు వీణ శ్రీవాణి చెప్పుకొచ్చారు. ప్రభాస్ సీతాఫలాలు మరలా అడగడంతో ఈ రహస్యాన్ని వీణా శ్రీవాణి బయటపెట్టింది. ఈ వీడియోపై ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి జాతకం పేరుతో ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అది మా హీరో గొప్పతనం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.