ABN RK- NTR: 4 ఎంపీ స్థానాలు, మూడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన తెలంగాణలో బిజెపి ఆశలు పెంచుకుంటున్నది. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వరుసగట్టి హైదరాబాద్ కు వస్తున్నారు. కానీ ఇవే ఆశలు పొరుగున ఉన్న ఏపీలో బిజెపికి లేవు. ఇప్పటికి ఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యే పరిస్థితి బిజెపికి లేదు. అక్కడ పార్టీ నిలబడాలంటే ఒక గట్టి నాయకుడు కావాలి. కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టి సోము వీర్రాజు కు అవకాశం ఇచ్చినా ఆయనకు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ ఎంత మేరకు సహకరిస్తారో తెలియదు. ఇలాంటి స్థితిలోనే అమిత్ షాకు ఆశాదీపంలా ఎన్టీఆర్ కనిపించాడు. అప్పట్లో తనను వాడుకొని వదిలేసిన చంద్రబాబుపై ఇప్పటికీ ఎన్టీఆర్ లోలోపల రగిలిపోతూనే ఉన్నాడు. మోడీకి కూడా చంద్రబాబుపై అలాంటి ఫీలింగే ఉంది. శత్రువుకు శత్రువు మన మిత్రుడు అన్నట్టుగా అమిత్ షా ఆర్ ఆర్ ఆర్ కథకుడు విజయేంద్ర ప్రసాద్ ను లైన్లోకి దించారు. సీన్ కట్ చేస్తే ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారు. పేరుకే ఇది ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ ను అభినందించే ప్రోగ్రాం. కానీ తెర వెనుక లెక్కలు వేరే ఉన్నాయి. ఆమధ్య చిరంజీవిని అడిగారు. ఆయన ఆసక్తి లేదని చెప్పడంతో అమిత్ తారక్ వద్దకు వచ్చాడు. విషయం మొత్తం చెప్పాడు. దీనికి తారక్ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. అందటితోనే భేటీ ముగిసింది. దీనిని ఇంతటితోనే అమిత్ వదిలేస్తాడని కాదు. ముందు ముందు స్టోరీ చాలా ఉంది. అమిత్, తారక్ భేటీలో జరిగింది ఇది. కానీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే రాసింది వేరు. రాసుకొచ్చింది వేరు. ఎంతసేపు తారక్ బిజెపిలోకి చేరితే నష్టపోతాడని హెచ్చరికలు జారీ చేశాడు. రాధాకృష్ణలో ఉన్న టెంపర్ మెంట్ అదే. ఇప్పుడు తెలుగు జర్నలిజం లో పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న విషయాలను కాస్తో కూస్తో రాయగలిగిన జర్నలిస్టు కూడా అతనే. మిగతా విషయాల్లో కొంత ప్రొఫెషనలిజం ప్రదర్శించే ఆయన, చంద్రబాబు విషయం వచ్చేసరికి వీర విధేయ పసుపు భక్తుడు అయిపోతాడు.

అప్పట్లో ఎన్టీఆర్ ను పొగిడాడు
2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఆంధ్రజ్యోతి ఆకాశానికి ఎత్తింది. అదే సమయంలో తన కూతురు అనూషను ఎన్టీఆర్ కు ఇవ్వాలని రాధాకృష్ణ ఒక ప్రతిపాదన పెట్టారు. దీనికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ అసలు సమ్మతించలేదు. ఇక అప్పటినుంచి ఏదో ఒక రూపంలో తన అక్కసును బయట పెడుతూనే ఉన్నాడు. తాజాగా రాసిన కొత్త పలుకులో కూడా ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఒక హెచ్చరిక పంపాడు. వాస్తవానికి ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా టిడిపికి అంత సానుకూల పవనాలు ఏమీ లేవు. పైగా ఇప్పుడు చంద్రబాబు 70 ఏళ్లకు దగ్గరగా వచ్చారు. మహా అయితే ఆయన వచ్చే టర్మ్ వరకు పనిచేయగలరు కావచ్చు. ఇప్పటికీ కూడా లోకేష్ జనాల్లో అంత ప్రొజెక్ట్ కావడం లేదు. అతని పనితీరుపైన సీనియర్లు గుర్రు గానే ఉన్నారు.
Also Read: Kavitha vs ABN RK: కవిత వర్సెస్ ఏబీఎన్ ఆర్కే.. ఇంతకీ ఈ వాదనలో ఎవరు గెలిచారు?

కొంతమంది అయితే ఎన్టీఆర్ పార్టీని టేక్ ఓవర్ చేయాలని భావిస్తున్నారు. ” జగన్ 50 ఏళ్లకు దగ్గరగా వచ్చారు. ఇప్పట్లో వాళ్ల పార్టీకి వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. కానీ టిడిపిలో ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. పార్టీలో నెంబర్ వన్ మాత్రమే బలంగా ఉండకూడదు. అవసరమైతే నెంబర్ 2 కూడా ఆ స్థానాన్ని భర్తీ చేసేంత స్థాయిలో ఉండాలి. కానీ ప్రస్తుతం మా పార్టీలో అలాంటి పరిస్థితి లేదని” టిడిపి నాయకులు వాపోతున్నారు. అయితే అంతకుముందు ఎన్టీఆర్ తో కొద్దో గొప్పో చనువుగా ఉన్న చంద్రబాబు కుటుంబం అమిత్ షా తో మీటింగ్ తర్వాత దూరం పెట్టడం ప్రారంభించింది. పైగా తమ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడం మొదలుపెట్టింది. అయితే ఇదే సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశి వంటి వారు మాత్రం ఎన్టీఆర్ టిడిపిని అష్టగతం చేసుకుంటేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మిగతా వారి పై నిర్మోహమాటంగా రాసే.. ఆర్కే చంద్ర బాబు విషయంలో మాత్రం శిష్య భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు. తాజా కొత్త పలుకులో ఎన్టీఆర్ కు పంపిన హెచ్చరికలు అలాంటివే మరి! చంద్రబాబుకు వ్యతిరేకంగా, లోకేష్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తే ఎలా ఊరుకుంటాడు.
Also Read:IND Vs PAK: థ్రిల్లింగ్ చివరి ఓవర్.. పాకిస్తాన్ పై టీమిండియా గెలుపునకు అతడే కారణం
[…] […]