India Vs Pakistan- Vijay Deverakonda: పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఎన్నో అంచనాలు క్రియేట్ చేసినా అభిమానుల ఆశలు అందుకోలేకపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో ఊహించుకున్నా రికార్డులు మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. దీంతో పూరీ డైరెక్షన్ లో భారీ అపజయం మూటగట్టుకుంది. లైగర్ సినిమా ట్రైలర్, టీజర్, పాటలు ఎంతో ఉత్సుకత రేపినా కథ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెదవివిరుస్తున్నారు. లైగర్ లో ఏమీ లేదని చెబుతున్నారు. దీంతో లైగర్ హిట్ సాధించకుండా ఫట్ గా మిగిలిపోవడం గమనార్హం.

నిన్న జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా హీరో విజయ్ దేవరకొండ నిలవడం గమనార్హం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు విజయ్ దుబాయ్ వెళ్లి స్టేడియంలో అందరిలో ఆకర్షణగా మారాడు. ప్రేక్షకుల్లో జోష్ నింపే పని చేశాడు. చివరకు టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ కాసేపు అందరితో సందడి చేయడం గమనార్హం.
Also Read: ABN RK- NTR: చంద్రబాబు జోలికి వస్తే ఆర్కే ఊరుకుంటాడా?
లైగర్ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో ఊహించుకున్నారు. అది వీలు కాకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమాను హైలెట్ చేయాలని ఎంత ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లడం సంచలనం కలిగించింది. విజయ్ దేవరకొండ మ్యాచ్ చూసేందుకు వెళ్లడంతోనే టీమిండియా విజయం సాధించిందని వాదనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ విజయ్ అందరితో ఆప్యాయంగా మాట్లాడాడు. మన వారు కొట్టే షాట్లను తెగ ఎంజాయ్ చేయడం కనిపించింది.

విజయ్ దేవరకొండ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందరిలో జోష్ నింపే క్రమంలో విజయ్ చేసిన హంగామా అందరిని ఆకట్టుకుంది. ఒక దశలో ఇండియా గెలుపుకు కారణం విజయ్ అనే చాలా మంది నమ్ముతున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు విజయ్ టీవీ స్క్రీన్ పై కనిపించాడు. పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్, భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తో ముచ్చటించాడు. దీంతో టీమిండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించడం అందరిని సంతోష పరచింది. దీనికి విజయ్ దేవరకొండ కారణమని చాలా మంది చెబుతుండటం విశేషం.
Also Read:Kavitha vs ABN RK: కవిత వర్సెస్ ఏబీఎన్ ఆర్కే.. ఇంతకీ ఈ వాదనలో ఎవరు గెలిచారు?