https://oktelugu.com/

జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన కొత్త పలుకు ద్వారా తెలుగు రాష్ట్రాల పాలకుల పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆర్కే తన కొత్త పలుకులో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ చేతగానితనం వల్లే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో, నిర్ణయాలు తీసుకున్నా అమలు చేయడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ప్రతి మాటలో ఆర్కే జగన్ పాలనపై అవాక్కులు చవాక్కులు పేల్చారు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 31, 2020 5:43 pm
    Follow us on

    ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన కొత్త పలుకు ద్వారా తెలుగు రాష్ట్రాల పాలకుల పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆర్కే తన కొత్త పలుకులో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ చేతగానితనం వల్లే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో, నిర్ణయాలు తీసుకున్నా అమలు చేయడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ప్రతి మాటలో ఆర్కే జగన్ పాలనపై అవాక్కులు చవాక్కులు పేల్చారు.

    Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?

    జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం, మూడు రాజధానుల నిర్ణయం న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడానికి జగన్ అనుసరించిన విధానమే కారణమని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన జగన్ కు ఏ కోశాన లేదని ఆర్కే అన్నారు. పేదలకు ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తే చెల్లవో ఆ విధంగా జగన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం వల్లే జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని తెలిపారు.

    చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై సైతం ఆర్కే స్పందించి వివరణ ఇచ్చారు. జగన్ నిర్ణయాలకు హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని… దీనిని బట్టి చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో హేతుబద్ధత అర్థమవుతోందని చెప్పారు. జగన్ ప్రతి నిర్ణయాన్ని విపక్షాలు కోర్టుల్లో అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని… నిజాలు నిలకడ మీద తెలుస్తాయని అన్నారు.

    Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?