https://oktelugu.com/

కోమటిరెడ్డికి కీలక పదవీ దక్కనుందా?

తెలంగాణ కాంగ్రెసులో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి క్రేజ్ ఉంది. నల్లొండ జిల్లాకే పరిమితమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెసులో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో వారి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేలా కోమటిరెడ్డికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 01:57 PM IST
    Follow us on

    తెలంగాణ కాంగ్రెసులో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి క్రేజ్ ఉంది. నల్లొండ జిల్లాకే పరిమితమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెసులో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో వారి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేలా కోమటిరెడ్డికి కాంగ్రెసులో ఓ కీలక పదవీ రాబోతుందనే టాక్ తాజాగా విన్పిస్తోంది.

    Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

    నల్గొండ జిల్లాలో జానారెడ్డి వంటి సీనియర్ ఉన్నప్పటికీ దివంగత రాజశేఖర్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మరణానంతరం సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి నల్లొండకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరిద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వీరిమధ్య చాలా సన్నిహిత్యం ఉండేది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కే ప్రాధాన్యం ఇచ్చారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలుపొంది సత్తాచాటాడు.

    కాంగ్రెస్ పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా విన్పిస్తోంది. తనకు పీసీసీ ఇస్తే కేసీఆర్ పై తన ప్రతాపం చూపిస్తానంటూ ఎన్నోసార్లు బహిరంగగానే ప్రకటించాడు. అయితే ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా చరిష్మా లేకపోవడంతో అధిష్టానం ఆయనకు పదవీ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న కోమటిరెడ్డి సేవలను మరోవిధంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీడబ్ల్యూసీలోకి కోమటిరెడ్డిని తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    రాబోయే ఎన్నికలు కులపరంగా జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఉందని భావిస్తోంది. దీంతో తొలి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీఠ వేయాలని భావిస్తోంది. జానారెడ్డి వయస్సు రీత్య రాజకీయాల్లో యాక్టివ్ లేకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో కొన్ని జిల్లాలో కోమటిరెడ్డి ఆర్థికంగా కాంగ్రెస్ ను ఆదుకుంటాడని భావిస్తుందట. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఓ కీలక పదవీ ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తి పర్చాలని కాంగ్రెస్ భావిస్తుందట. దీంతో కోమటిరెడ్డికి కాంగ్రెస్ ప్రమోషన్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.