https://oktelugu.com/

‘జీఎస్టీ’పై జగన్ కు మరోదారి లేదా?

కరోనా వైరస్ ప్రపంచాన్నే చిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మన దేశం ఇందుకు భిన్నమేమీ కాదు. కరోనా వైరస్ కారణంగా మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ పూర్తి లాక్ డౌన్ కోనసాగింది. దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫలితంగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (గూడ్స్ సర్వీసు టాక్స్) వసూలు చేసి రాష్ట్రాలకు వాటా ఇస్తుంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 3:55 pm
    Follow us on

    Is there no other way for Jagan on ‘GST’?

    కరోనా వైరస్ ప్రపంచాన్నే చిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మన దేశం ఇందుకు భిన్నమేమీ కాదు. కరోనా వైరస్ కారణంగా మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ పూర్తి లాక్ డౌన్ కోనసాగింది. దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫలితంగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (గూడ్స్ సర్వీసు టాక్స్) వసూలు చేసి రాష్ట్రాలకు వాటా ఇస్తుంది. కరోనా నేపథ్యంలో జీఎస్టీ వాటా చెల్లించలేమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధాన్ని పెంచేలా ఉంది.

    Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?

    కేంద్రం ప్రకటనపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. తెలంగాణా, బీహార్ వంటి రాష్ట్రాలు జీఎస్టీ ఎందుకు చెల్లించలేరని ప్రశ్నిస్తున్నాయి. ఏపీ మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ ఏటువంటి దోరణి అవలంభించాలనే ఓ నిర్ణయానికి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 90 వేల కోట్ల నుంచి లక్ష వరకూ జీఎస్టీని వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా నెలకు రూ. 2,200 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని ఆర్ధిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు జీఎస్టీ వాటా చెల్లించలేమని కేంద్రం చెబుతూ ఉపసమనంగా… రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పొడిగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రమే అప్పు తీసుకుని జీఏస్టీ కింద రాష్ట్రాలకు నిధులు అందించాలని పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

    అన్ని వ్యవహారాల్లో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించే ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట విద్యుత్ చట్టానికి సరవణ చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను తెలంగాణా సహా మరికొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం మిన్నకుండి పోయారు. కేంద్రం విద్యుత్ చట్టంలో తెచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రాల అధికారాలకు భంగం కలుగుతుందని రాష్ట్రాలు వాదించాయి. సీఎం జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీఎస్టీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ వారంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీఎస్టీపై అనుసరించాల్సిన వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

    Also Read : ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక కారణమదేనా?