Aadhaar card update 2025: ఆధార్.. భారత దేశంలో యూనిక్ గుర్తింపు కార్డు. దేశంలో 95 శాతం మంది ఆధార్ కాలిగి ఉన్నారు. బిహార్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కొందరికి రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డు ప్రవేశపెట్టి పదేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆధార్ అప్‌డేట్ చేస్తోంది. అప్‌డేట్ చేయనివారి ఆధార్ నంబర్లు బ్లాక్ చేసే ఆలోచనలో ఉంది. ఇక పిల్లల ఆధార్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) 5–7 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించింది. ఈ వయస్సు గల పిల్లల ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్‌లు నవీకరించకపోతే, ఆధార్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ చర్య పిల్లల ఆధార్ వివరాలను కచ్చితంగా ఉంచడం ద్వారా వారి గుర్తింపును సురక్షితం చేయడానికే అని స్పష్టం చేసింది.
Also Read: డ్రైవర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ జేబులో పెట్టుకుంటే మీరు బ్లాకులో పడ్డట్లే
పుట్టిన వెంటనే ఆధార్..
ప్రస్తుతం పుట్టిన పిల్లలకు కూడా యూఐడీఏఐ ఆధార్ కార్డు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా బయోమెట్రిక్ వివరాలు ఐదేళ్ల వరకు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఐదేళ్ల వరకు వేలి ముద్రలు మారతాయి. ఇక ఐరిస్ తీసుకుంటే.. చిన్న పిల్లల కంటిపాప దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఐదేళ్ల వరకు బయోమెట్రిక్ తీసుకోవడం లేదు. ఇక ఐదేళ్లు దాటిన తర్వాత ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ తప్పనిసరిగా అప్‌డేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పిల్లల గుర్తింపును ఆధార్ వ్యవస్థలో సమగ్రంగా నమోదు చేయడానికి సహాయపడుతుంది.
Also Read: భాషా వివాదం ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలు అప్రమత్తం కావాలిసిన వేళ!
అప్‌డేట్ ఎందుకు?
ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ కాని పక్షంలో, పిల్లలు పాఠశాల అడ్మిషన్‌లు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఆర్థిక బదిలీ పథకాల వంటి ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను సకాలంలో నిర్వహించడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కేంద్రాల సౌలభ్యం, అవగాహన లోపం కారణంగా కూడా అప్‌డేట్ చేయించడం లేదు. యూఐడీఏఐ మాత్రం అప్‌డేట్ తప్పనిసరి అని పేర్కొంటోంది.