Aadhaar Free Update: భారత ప్రభుత్వం ప్రతీ భాతీయుడికి గుర్తింపు కార్డును ఇచ్చింది అదే ‘ఆధార్’. నేడు ఈ కార్డు అన్నింట్లో అత్యవసరంగా మారుతోంది. పుట్టిన బిడ్డ స్కూల్ లో జాయిన్ అయినప్పటి నుంచి వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తించే వరకు ప్రతీ దానిలో ఈ కార్డును తప్పనిసరి చేశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా సందర్భాల్లో ఈ కార్డుతో అవసరం పడుతూనే ఉంటుంది. అయితే ఈ కార్డులో అప్పుడప్పుడు మార్పులు, చేర్పులు తప్పనిసరి అవుతాయని కేంద్రం భావించింది. అందుకే ప్రతీ ఐదేళ్లకు ఒకసారి మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పిస్తుంది. ఇందులో పేరులోని అక్షరాల్లో మార్పులు, లేదంటే అడ్రస్ మార్పు.. ఇలా ప్రతీది మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఆధార్ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటి (డిసెంబర్ 14) తో ముగియనుంది. ఈ నేపథ్ంయలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉడాయ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. 2025, జూన్ 14వ తేదీ వరకు.. అంటే ఏకంగా ఆరు నెలలు గడువు ఇచ్చింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు, చేర్పులు చేసుకునే వారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఉడాయ్ నిబంధనల ప్రకారం.. ప్రతీ పదేళ్లకోసారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అది అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదు.. ఏది అప్ డేట్ చేసుకోవాలో దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉచిత సేవలను ‘మై ఆధార్’ పోర్టల్ లో మాత్రమే అందుబాటులో ఉంచుతారు. పేరు, పుట్టిన తేదీ (బర్త్ డేట్), చిరునామా (అడ్రస్) వంటి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆధార్ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా చేసుకోవచ్చు..
– ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ముందుగా ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
– రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే గతంలో ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
– ఆ వివరాలు సరైనవేనా.. మార్చాలా.. అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ వీటిలో సవరణలు చేయాలని అనుకుంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి.
– తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంపిక చేసుకోవాలి.
– ఆయా డాక్యుమెంట్లకు సంబంధించిన స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
– 14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.