Pak Vs SA t20 2nd: పాకిస్తాన్ జట్టు గత కొంతకాలంగా దారుణమైన క్రికెట్ ఆడుతోంది. ఇటీవల వరుస విజయాలు సాధించి గాడిలో పడింది. అయితే అది పాలపొంగునే తలపించింది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తోంది. ఇటీవల సౌత్ ఆఫ్రికా జట్టును భారత్ ఓడించింది. వారి సొంత దేశం లోనే టి20 సిరీస్ దక్కించుకుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తలపడుతున్న పాకిస్తాన్ 3 t20 మ్యాచ్ల సిరీస్ ను కోల్పోయింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. శనివారం జరిగిన రెండవ టి20 మ్యాచ్లో గెలుపు వాకిట్లో బోల్తా పడింది. దీంతో ఆతిధ్య సౌత్ ఆఫ్రికా జట్టు టి20 సిరీస్ ను దక్కించుకుంది. పాకిస్తాన్ ఒకానొక దశలో గెలిచేలాగా కనిపించింది. అయితే ఆ జట్టు బౌలర్ హారిస్ రౌఫ్ దారుణంగా బౌలింగ్ వేయడంతో పాకిస్తాన్ జట్టు ఓడిపోవలసి వచ్చింది. అతడు గనుక చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే, పాకిస్తాన్ విజయం సాధించి ఉండేది. పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పాటు ఆడి.. ఐదు వికెట్ల నష్టపోయి 206 రన్స్ చేసింది. సయీమ్ ఆయూబ్ 57 బంతుల్లో 98* పరుగులు చేశాడు. వెంట్రుక వాసిలో అతడు సెంచరీ కోల్పోయాడు. మరో ఆటగాడు ఇర్ఫాన్ ఖాన్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో దయాన్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. బార్ట్ మన్ ఒక వికెట్ పడగొట్టాడు.. పాకిస్తాన్ విధించిన 207 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఏమాత్రం భయపడకుండా సాధించింది. రీజా హెండ్రిక్స్ 63 బంతుల్లో 117 పరుగులు చేసి అదరగొట్టాడు. రాసీ వాన్ డెర్ డస్సెన్ 38 బంతుల్లో 66* ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లలో జహందాద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అబ్బాస్ ఆఫ్రిది ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు.
నాటకీయ పరిణామాలు
చివరి రెండు ఓవర్లలో సౌత్ ఆఫ్రికా జట్టుకు 19 పరుగులు అవసరం అయ్యాయి. ఆ దశలో 19 వ హారీస్ రౌఫ్ వేశాడు. ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు. ఇతడి ఓవర్ లో క్లాసెన్ ఫోర్ కొట్టాడు. డస్సెన్ సిక్సర్ కొట్టాడు. చివరి ఓవర్ లో అబ్బాస్ ఆఫ్రిది కట్టడిగా బౌలింగ్ చేసినప్పటికీ డస్సెన్ భారీ సిక్స్ కొట్టాడు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా ఘనవిజయాన్ని సాధించింది. రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఉంటే పాకిస్తాన్ కచ్చితంగా గెలుపును సొంతం చేసుకునేది. ఈ మ్యాచ్లో రౌఫ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 57 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అతడు విఫలం కావడంతో పాకిస్తాన్ జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకుంది.. అంతేకాదు టి20 సిరీస్ కూడా కోల్పోయింది.. ఇటీవల జింబాబ్వే పై t20 సిరీస్ గెలిచిన పాకిస్తాన్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.