
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఈ చాలెంజ్ లు, తొడగొట్టడాలు.. పంతాలు పట్టింపులు ఎక్కువయ్యాయి. ఐస్ బకెట్ చాలెంజ్ అని.. షుగర్ చాలెంజ్ అని నానా చాలెంజ్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య విదేశాల్లో పాలప్యాకెట్ డబ్బాలపై నడిస్తూ కొందరు నడుం విరగొట్టుకున్నారు.
అది మరువక ముందే తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ‘శ్రేయా కల్రా’ అలాంటి పనే చేసింది. శ్రేయాకు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పేరిట వీడియోలు చేయడమంటే తెగ పిచ్చి. అవే లోకంగా బతుకుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఏకంగా ఆమెకు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.
శ్రేయా ఎక్కువగా తనను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోరే డేర్ ఛాలెంజ్ రీల్స్ ను ఎక్కువగా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే శ్రేయను నడిరోడ్డుపై రెడ్ సిగ్నల్ పడినప్పుడు డ్యాన్స్ చేయాలని ఎవరో చాలెంజ్ విసిరారట.. ఇంకేముంది ఆ అందమైన యువతి పోలోమని రహదారిపైకి వెళ్లింది.
రెడ్ సిగ్నల్ పడగానే మూతికి నల్ల మాస్క్ ధరంచి సినిమాటిక్ స్టైల్లో అందమైన డ్రెస్ వేసుకొని నడిరోడ్డుపై డ్యాన్స్ తో ఇరగదీసింది. ‘రూల్స్ బ్రేక్ చేయకండి.. రెడ్ సిగ్నల్ వద్ద మీరు ఆగిపోవాలి.. ఎందుకంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి.. మాస్కులు ధరించండి’ అంటూ నడిరోడ్డుపై చేసిన డ్యాన్స్ వీడియోను పోస్టు చేసి ఈ అమ్ముడు నీతి సూత్రాలు వల్లించింది.
వాహనదారులంతా రెడ్ సిగ్నల్ పడి ఆగిన వేళ శ్రేయ చేసిన డ్యాన్స్ ను కళ్లప్పగించి చూశారు. అందరి కళ్లు జిగేల్ మనేలా డ్యాన్స్ చేసి శ్రేయ దుమ్మురేపింది. ఆ వీడియోను కాస్త ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. చివరకు అదే ఆమెను చిక్కుల్లో పడేసింది.
అంతా బాగానే ఉంది కానీ ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఆడిపాడిన ఆ శ్రేయపై పోలీసులు కేసు నమోదు చేసి గట్టి షాక్ ఇచ్చారు. రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ పడి ఉంటే ఆ యువతి ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్ లు వద్దని పోలీసులు, నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇప్పటికే ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు ఇలా రూల్స్ అతిక్రమించి మరీ రీల్స్ చేస్తున్నారు. వారందరికీ శ్రేయపై కేసు నమోదు ఒక గుణపాఠంగా మారనుంది.
వీడియో ఇదే..
https://www.youtube.com/watch?v=Ly0ON0X_PNs