https://oktelugu.com/

Solar System : మహా శివరాత్రి వేళ అంతరిక్షంలో అద్భుతం.. నాసా షాక్‌!

Solar System : నాసా.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. అనేక కొత్త విషాయలు తెలుసుకున్నా.. ఇంకా ఏదో ఉంది అని పరిశోధనలు కొనసాగిస్తుంది. నిరంతరం తెలుసుకోవాల్సిన విషయాల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో మహాశివరాత్రి రోజు మన సౌర కుటుంలో అద్భుతాన్ని గుర్తించి షాక్‌ అయింది.

Written By: , Updated On : February 26, 2025 / 01:46 PM IST
Solar System

Solar System

Follow us on

Solar System : విశ్వంలో మహాద్భుతం. ఇందులో గ్రహాలు, నక్షత్రాలే కాదు గెలాక్సీలు, పాలపుంతలు, సూపర్‌నోవాలు, కృష్ణ బిలాలు ఇలా చాలా ఉన్నాయి. వాటిగురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(Nasa) పరిశోధనలు చేస్తోంది. అంతరిక్షం(Space) గురించి ఇప్పటికే చాలా విషయాలు గుర్తించిన నాసా.. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయంటుంది. ముఖ్యంగా.. ఊర్ట్‌ క్లౌడ్‌ (Oort Cloud) పెద్ద మిస్టరీగా ఉంది. అదే మన గ్రహాలకు దూరంగా ఉన్న సౌర కుటుంబంలోని చివరి ప్రాంతం. మన సౌర కుటుంబాన్ని ఒక సీడీలా భావిస్తే అందులో మధ్య భాగం సూర్యుడు. చివరి భాగం ఊర్ట్‌ క్లౌడ్‌. ఇది ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

ఊర్ట్‌ క్లౌడ్‌లో పరమ శివుడి మూడో నేత్రం..
ఊర్ట్‌ క్లౌడ్‌లో లెక్కలేనన్ని తోక చుక్కలు ఉన్నాయి. ఇవి తరచూ సూర్యుడివైపు వస్తుంటాయి. కానీ, ఇప్పటి వరకు ఊర్ట్‌ క్లౌడ్‌ అనేది ఎలా ఉంటుందో కచ్చితంగా తెలియదు. దీని ఆకారం తెలుసుకునేందుకు నాసా సూపర్‌ కంప్యూటర్ల(Super Computers)తో సిమ్యులేషన్‌ తయారు చేయించింది. ఆ కంప్యూటర్లు తయారు చేసిన సిమ్యులేషన్‌ చూసి నాసా శాస్త్రవేత్తలు షాక్‌ అయ్యారు. అక్కడ పరమ శివుడి మూడో కన్నులాంటి రూపం వారికి కనిపించింది. ఊర్ట్‌ క్లౌడ్‌ ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది. అక్కడ ఉండేరాళ్లు ఐస్‌ ముక్కల్లా ఉంటాయి. వాటిపై ఉండే ఐస్‌ని సుత్తితో పగలగొట్టినా పగలవు. అత్యంత చల్లదనంతో ఉంటాయి. అలాంటి తోకచుక్కలు, రాళ్లు అన్నీ కలిసి అక్కడో చిన్న సైజు పాలపుంత(చిన్న గెలాక్సీ) ఆకారంలో ఉండి ఉంటాయిన తెలుస్తోంది.ఆ పాలపుంత రెండు స్సైరల్‌ చేతులు ఉండి ఉండొచ్చని కంప్యూటర్‌ సిమ్యులేటర్‌ చెబుతోంది.

Solar System

స్సైరల్‌ డిస్క్‌లా..
ఇప్పటి వరకు ఊర్ట్‌ క్లౌడ్‌ రూపం ఎలా ఉంటుందో తెలియదు. సోలార్‌ సిస్టం(Solar System)చివర్లో ఈ ఊర్ట్‌ క్లౌడ్‌ ఎలా ప్రభావం చూపుతుందో కూడా తెలియదు. తాజాగా మోడల్‌ అంచనా ప్రకారం.. ఊర్ట్‌ క్లౌడ్‌ మధ్యభాగం ఒక స్పైరల్‌ డిస్క్‌లా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలను ప్రింట్‌ సర్వర్‌(Print Surver)ఆర్‌జీవ్‌లో ప్రచురించారు. ఊర్ట్‌ క్లౌడ్‌ ప్రారంభంలో సుమారు 5 వేల రాళ్లు తోక చుక్కలు, ఖగోళాలు ఉంటాయని అంచనా. ఈ ఊర్ట్‌ క్లౌడ్‌ చివరి భాగం సూర్యుడి నంచి సుమారు 10 వేల నుంచి లక్ష ఆస్ట్రనామిక్‌ యూనిట్స్‌ దూరం ఉంటుందని అంచనా. ఒక ఆస్ట్రానమికల్‌ యూనిట్‌ అంటే 15 కోట్ల కిలోమీటర్లు. అంటే భూమి నుంచి సూర్యుడు ఉన్నంత దూరం. ఇక నాసాకు చెందిన వోయూజర్‌ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ రోజుకు 16 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఇప్పటికే ప్లూటోని దాటింది. కానీ ఊర్ట్‌ క్లౌడ్‌ని చేరాలంటే ఇంకా 300 ఏళ్లు పడుతుంది. ఊర్ట్‌ క ఔ్లడ్‌ను దాటాలంటే 3 లక్షల ఏళ్లు పడుతుంది.

ఊర్ట్‌ క్లౌడ్‌కు రూపం..
ఇదిలా ంటే నాసాకు చెందిన ప్లీడ్స్‌ సూపర్‌ కంప్యూటర్‌ ఊర్ట్‌ క్లౌడ్‌ రూపాన్ని సృష్టించింది. ఇది చూడడానికి పాలపుంత గెలాక్సీలా ఉంటుంది. పాలపుంత గెలాక్సీకి ఎలాగైతే స్పైర్‌ చేతులు ఉన్నాయో.. అలాగే ఊర్ట్‌ క్లౌడ్‌కి కూడా రెండు స్పైరల్‌ చేతులు ఉన్నాయి. ఒక్కో చేయి సూపర్‌ 15 వేల ఏయూల పొడవుంటుంది. అయితే ఇది కంప్యూటర్‌ మోడల్‌ మాత్రమే. అయితే సూపర్‌ కంప్యూటర్‌ అనేది చాలా వాస్తవ విషయాలను లెక్కలోకి తీసుకుని ఈ మోడల్‌ను రూపొందించింది. అందుకే ఊర్ట్‌ క్లౌడ్‌ ఇలాగే ఉండొచ్చని భావిస్తున్నారు. మన సౌర కుటుంబం అవతలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఊర్ట్‌ క్లౌడ్‌ మిస్టరీ వీడాల్సి ఉంది.

Solar System