New Ration Cards
New Ration Cards :m తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులు పరిశీలించి గ్రామ, వార్డు సభల్లో ఆమోదం తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసింది. 5 లక్షల కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు జనవరి 26న సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్(MLC election Schdule) రావడంతో జారీ నిలిచిపోయింది. మరోవైపు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో మీసేవ కేంద్రాల ద్వారా ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 1.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకుపైగా దరకాస్తులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఇక కుటుంబ సభ్యుల తొలగింపు, చేర్పు కోసం మరో 20 లక్షల దరకాస్తులు వచ్చాయని చెబుతున్నారు.
ఇప్పటికే 16,900 కుటుంబాలకు..
జనవరి 26న పథకం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి 16,900 కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు జారీ చేశారు. వీరికి ఫిబ్రవరి(February)నెలకు సంబంధించిన రేషన్ కూడా పంపిణీ చేశారు. దీంతో మిగతా లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇళ్లకే వచ్చేస్తాయి. అయితే ఎన్నికలు జరిగే జిల్లాల్లో మాత్రం మార్చి 8 నుంచి జారీ చేస్తారు.
ఒకేరోజు లక్ష కార్డులు..
మార్చి 1న రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల మందికి ఒకేసారి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, వికారాబాద్ జిల్లాలో 22 వేలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 15 వేలు, గద్వాల జిల్లాలో 13 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 వేలు, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 6 వేలు, వనపర్తి జిల్లాలో 6 వేలు, హైదరాబాద్‌లో 285 మందికి కొత్త కార్డులు జారీ చేస్తారు.