KTR: మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా వారిపై అరాచకాలు ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లి నుంచి ఓ మూలన ఉన్న పల్లెటూర్లలోనూ ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వెలుగులోకి వచ్చేవి కొన్నయితే.. వెలుగులోకి రానివి మరెన్నో. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దోషులను తేలిన వారిపై కోర్టులు చట్టరీత్యా శిక్షను అమలు చేస్తున్నాయి. కానీ అఘాయిత్యాలు తగ్గడం లేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.

చిన్న పిల్లలనూ వదలడం లేదు..
కామాందులు చిన్న పిల్లలనూ వదలడం లేదు. తమ కామవాంఛ తీర్చుకునేందుకు చిన్న పిల్లలని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌తో ఫొటో దిగడంతో ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ కూతురు (6) ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సర్పంచ్ ఇంట్లో అద్దెకుంటూ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపపై దుశ్చర్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లి కూతురు పరిస్థితి చూసి విషయం ఆరాతీసింది. భర్తకు సమాచారం ఇచ్చారు. ఇద్దరూ కలిసి అతడిని నిలదీశారు. తప్పు ఒప్పుకోకపోగా.. వారిద్దరిని ఇంట్లో బంధించి పారిపోవాలని ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు తలుపులు పగలగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్ని చట్టాలు ఉన్నా..
మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. వారి భద్రత కోసం ఎన్నో కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీలో 2013లో నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశం నలుమూలలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వంపై, నేరస్తులపై ప్రజల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే తీవ్ర శిక్షలు ఉంటాయని పేర్కొంది. ఆ నిర్భయ ఘటనలో దోషులని తేలిన వారికి ఉరిశిక్ష అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా షీ టీంలు ఏర్పాటు చేసింది.
Also Read: EXIT Poll: ఎగ్జిట్ పోల్స్-హుజూరాబాద్ లో బీజేపీదే గెలుపు!
ఇలా ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా.. మహిళలపై ఎక్కడో ఓ చోట ఘటనలు జరుగుతూనే ఉండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశం.
ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని ఆ మహాత్ముడు పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా ఉదయం సమయంలో తిరగలేని పరిస్థితి ఉంది. ఇది మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Huzurabad: హుజురాబాద్ లో పెరిగిన పోలింగ్ తో ఎవరికి లాభం?