Etela Rajender: ఈటలకు ఇక మూడినట్టేనా?

Etela Rajender: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ కబ్జాపై నిజాలు వెల్లడవుతున్నాయి. మెదక్ జిల్లాలో సుమారు డెబ్బయి ఎకరాల్లో ఈటల కబ్జాకు పాల్పడినట్లు కలెక్టర్ హరీష్ తేల్చడంతో ఈటల మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు నిర్వహించిన సర్వేలో అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగినట్లు రుజువవుతోందని చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ ఓ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో అసైన్డ్ భూముల వ్యవహారం ఈటల మెడకు బిగుస్తున్నట్లు రాజకీయ […]

Written By: Srinivas, Updated On : December 6, 2021 7:28 pm
Follow us on

Etela Rajender: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ కబ్జాపై నిజాలు వెల్లడవుతున్నాయి. మెదక్ జిల్లాలో సుమారు డెబ్బయి ఎకరాల్లో ఈటల కబ్జాకు పాల్పడినట్లు కలెక్టర్ హరీష్ తేల్చడంతో ఈటల మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు నిర్వహించిన సర్వేలో అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగినట్లు రుజువవుతోందని చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ ఓ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో అసైన్డ్ భూముల వ్యవహారం ఈటల మెడకు బిగుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Etela Rajender

ఈ నేపథ్యంలో జమున హేచరీస్ యాజమాన్యం యథేచ్ఛగా వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారుల సర్వేలో పలు విషయాలు బయటపడ్డాయి. సదరు భూమిలో పెద్ద పెద్ద షెడ్లు వేసి కోళ్ల ఫాంలు నిర్మించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దీనిపై ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. దీంతో అసైన్డ్ భూముల వ్యవహారం ఈటలకు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అనేక చెట్లు నేలమట్టం చేశారు. దీంతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఈటలను భూ కబ్జా కేసులో బహిష్కరించిన విషయం తెలిసిందే. కానీ అధికారుల అండతోనే భూ కబ్జా జరిగినట్లు అధికారుల విచారణలో వెలుగు చూస్తోంది. దీంతో మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసి నివేదించనున్నట్లు సమాచారం.

Also Read: Telangana govt: యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని చెబుతున్న రాష్ర్ట ప్రభుత్వం

ఇదే సందర్భంలో అధికారులపై చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఎవరెవరు సహకరించారు? ఏ మేరకు కబ్జా జరిగింది? తదితర విషయాలపై సమగ్రంగా విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి అసైన్డ్ భూముల వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: AP New Capital: ఏపీకి నయా రాజధాని విశాఖ.. ముహుర్తం ఫిక్స్?

Tags