Mahesh Babu and NTR’s EMK: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే స్క్రీన్ ను పంచుకోవడంతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ చివరి ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ అదిరిపోయింది పైగా ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు, మహేష్ సమాధానాలు.. మధ్యలో ఎన్టీఆర్ కౌంటర్లు చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో మహేష్ రూ.25 లక్షలను గెలుచుకున్నా.. ఎన్టీఆర్ మాత్రం మహేష్ అభిమానుల అభిమానాన్ని కూడా గెలుచుకున్నాడు.
ఈ మధ్య ఎన్టీఆర్ ఆలోచనా విధానమే కాదు, ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఎన్టీఆర్ లో మునపటి తొందరపాటు కనబడుటలేదు. మునపటి స్వార్ధం కనబడుటలేదు. నేను నా సినిమాలు అనే ధోరణి వైపు ఎన్టీఆర్ వెళ్లడం లేదు. ఈ ఎపిసోడ్ లో ఓ హైలైట్ డిస్కషన్ జరిగింది. ‘మహాభారతంలోని పాత్రల్లో ఏ పాత్ర అంటే ఇష్టం..? ఒకవేళ సినిమాగా తెరకెక్కిస్తే మీరు ఏ పాత్రలో నటిస్తారు ?’ అంటూ ఎన్టీఆర్, మహేష్ ను ప్రశ్నించాడు.
ఎన్టీఆర్ ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ.. ‘మహాభారతంలో అన్ని పాత్రలు చాలా కీలకం, కాబట్టి ఫలానా పాత్ర అని ఎంచుకోవడం కష్టం’ అంటూ సమాధానం చెప్పలేక తప్పించుకున్నాడు. అయితే, ఈ ప్రశ్న పై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘శ్రీ కృష్ణుడి గెటప్ లో ఆ పాత్రలో మీరు (మహేష్ బాబు) చాలా బాగుంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పడం మహేష్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.
Also Read: మహేష్ బాబుతో ఎన్టీఆర్ ఫన్.. ఫ్యాన్స్ కు పూనకాలే?
నిజానికి శ్రీకృష్ణుడి పాత్ర ఎన్టీఆర్ డ్రీమ్ రోల్. పైగా రాజమౌళి కూడా గతంలో పబ్లిక్ గా చెప్పాడు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూపించడం నా కల అని. అలాంటిది తాను పోషించాల్సిన పాత్రలో తారక్, మహేష్ బాగుంటాడు అని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఎన్టీఆర్ లో చాలా మార్పు వచ్చింది. అందరి హీరోలతో సన్నిహితంగా ఉంటున్నాడు.
Also Read: ఫ్యాన్స్… మహేష్ నుండి అలాంటి సినిమాలు ఆశించకండి
ఇక ఆ తర్వాత మహేష్ బాబు మాట్లాడుతూ ‘పిల్లలను మనం ఇప్పుడే తిప్పాలి. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు మనతో ఉంటారు. పెరిగాక వారి సర్కిల్ అంటూ వారికీ ఉంటుంది. వారితోనే వాళ్ళు ఎక్కువగా గడుపుతారు’ అని మహేష్ బాబు చెప్పగా.. ఎన్టీఆర్ మధ్యలో అందుకుని ‘మహేష్ అన్న ఈ విషయంలో మీ వల్ల మా ఇంట్లో కూడా నా పై ప్రెజర్ పెరుగుతుంది’ అని కౌంటర్ ఇచ్చాడు. మరి భవిష్యత్తులో మహేష్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ వస్తుందేమో చూడాలి.