Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంటి సభ్యులంతా వారి వారి శైలిలో అందరూ బాగానే ఆడుతున్నారు. టిఆర్‌పి పరంగా దూసుకుపోతూ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. నిన్న బిగ్ బాస్ ఇంటి నుండి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. ఇక వచ్చేవారం ఇంటి నుండి మరో సభ్యుడు వెళ్లనున్నారు. దాంతో బిగ్ బాస్ టాప్ 5 లిస్ట్ ఖరారు అవుతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నదానిపై చర్చ జోరుగా జరుగుతోంది. కాగా తాజాగా బిగ్ బాస్ విన్నర్ అతడే అంటూ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన మనసులోని మాట బయటపెట్టాడు.
ఈ మేరకు బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ అయ్యే అవకాశం ఉందని రాహుల్ అన్నాడు. సన్నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు అని తన పోస్ట్ ద్వారా ఎవరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదని చెప్పాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎవరికి వారు తమకు నచ్చిన వాళ్లకు సపోర్ట్ చేసుకోవచ్చని రాహుల్ తెలిపాడు. ఇదిలా ఉంటే విన్నర్ సన్నీ లేదా షణ్ముఖ్ జస్వంత్ అయ్యే అవకాశం ఉందని కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విన్నర్ ఎవరు అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాక తప్పదు.