https://oktelugu.com/

లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు

దేశ వ్యాప్తంగా ఆరు వారాలుగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఇంటికే పరిమితమైన మందు ప్రియులకు సోమవారం నుండి మద్యం షాపులపై ఆంక్షలు సడలించడంతో దేశం అంతటా పరవళ్లు తొక్కుతూ సంబరాలు చేసుకోవడం కనిపిస్తున్నది. మధ్య షాపుల ముందు భారీ క్యూలతో కొత్త సినిమా విడుదల సమయంలో కనిపించే హడావుడి కనిపిస్తూ వచ్చింది. మందుకు ఇంతకాలం మొఖం వసిన జనం ఇప్పుడు గుంపులుగా మద్యం షాపుల వైపు పెరుగుతూ తీస్తూ రావడంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 4:17 pm
    Follow us on


    దేశ వ్యాప్తంగా ఆరు వారాలుగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఇంటికే పరిమితమైన మందు ప్రియులకు సోమవారం నుండి మద్యం షాపులపై ఆంక్షలు సడలించడంతో దేశం అంతటా పరవళ్లు తొక్కుతూ సంబరాలు చేసుకోవడం కనిపిస్తున్నది. మధ్య షాపుల ముందు భారీ క్యూలతో కొత్త సినిమా విడుదల సమయంలో కనిపించే హడావుడి కనిపిస్తూ వచ్చింది.

    మందుకు ఇంతకాలం మొఖం వసిన జనం ఇప్పుడు గుంపులుగా మద్యం షాపుల వైపు పెరుగుతూ తీస్తూ రావడంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలను తెంచుకొని జనం ఎప్పుడు రోడ్లపైకి వస్తారేమో అంటూ పోలీసులు ఖంగారు పడిపోతూ ఉండడం కనిపించింది. చాలాకాలం తర్వాత మద్యం షాప్ లను తెరవడంతో భారీ సంఖ్య‌లో జ‌నం షాపుల ముందు నిల‌బ‌డ్డారు.

    రాజకీయ దుమారంలో `ఆరోగ్య సేతు’

    ఢిల్లీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఉద‌యం నుంచే షాపుల ముందు జ‌నం క్యూ క‌ట్టారు. కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కొన్ని చోట్ల జ‌నం మ‌రీ ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌డంతో ఆ నియమం ప‌ట్టించుకునే వారే కనబడటం లేదు.

    కంటైన్మెంట్ జోన్ల‌లో మిన‌హా అనేక ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్‌లో ఉన్న మ‌ద్యం షాపు వ‌ద్ద భారీ క్యూలైన్‌లో జ‌నం నిల‌బ‌డ్డారు. రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల్లోనూ ఉన్న వైన్ షాపుల్లోనూ మ‌ద్యం అమ్మేందుకు అనుమ‌తి ఇచ్చారు. సామాజిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డంతో క‌శ్మీరీ గేటు ప్రాంతంలో ఉన్న మద్యం షాపుల వ‌ద్ద లాఠీచార్జ్ జ‌రిగింది.

    ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ ఘటన పునరావృతం..ఎక్కడంటే?

    ఇక చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని రాజ్‌నంద‌గావ్ ప్రాంతంలో మ‌ద్యం అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. కానీ జ‌నం ఎవ‌రూ సాంఘిక దూరం నియ‌మాన్ని పాటించ‌డంలేదు. ఆ రాష్ట్రంలో కీల‌క‌మైన కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో మిన‌హా మిగితా అంత‌టా మ‌ద్యం అమ్మ‌కాలను ప్రారంభించారు. బెంగుళూరులో కూడా జ‌నం మద్యం షాపు ముందు క్యూక‌ట్టారు. ఆ రాష్ట్రంలో ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం అమ్మేందుకు అనుమ‌తులు ఇచ్చారు.

    ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉదయం 11గంటలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఉదయం నుంచే మద్యం షాపులవద్ద క్యూలో నిలబడ్డారు. దీంతో కొన్ని చోట్ల క్యూ లైన్లు కిలోమీటర్లమేర పెరిగాయి. రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి.

    ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచినా మందుబాబులు వెనుకడుగు వేయడంలేదు. కిక్ కోసం బారులుతీరారు. గుంటూరు జిల్లా నందివెలుగులో అయితే ఓ వైన్ షాపు వద్ద ఏకంగా 4 కి.మీ. మేర క్యూ పెరిగింది. ఎండ ఠారెత్తిస్తున్నా మద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చెప్పులు లైన్‌లో ఉంచారు.