అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్న మహిళలు.. ఈ ఒక్క విషయంలో వెనుకబాటు ఎందుకు అనుకున్నారో ఏమోగానీ.. మద్యం కోసం ప్రత్యేక క్యూలైన్లలో నిల్చోని మరీ కొనుగోలు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం దొరకని పరిస్థితి పరిస్థితి నెలకొంది. కేంద్రం తాజాగా కొన్ని సడలింపులతో మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో మద్యంప్రియులు ఉదయం నుంచే మద్యం షాపుల ఎదుట బారులు తీరారు. కొన్ని షాపుల ఎదుట మద్యంప్రియులు సామాజిక దూరంగా పాటిస్తూ తాపీగా మద్యం పట్టుకెళుతుండగా మరికొన్నిచోట్ల గుంపులుగా గుమ్మికూడటం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే మహిళలు కూడా క్యూలో నిల్చొని మద్యం కొనుగోలు చేస్తుండం ఆసక్తిని రేపుతోంది.
నేటి రోజుల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు మద్యాన్ని సేవిస్తున్నారు. పబ్బు కల్చర్ అలవాటైయ్యాక అమ్మాయిలు తాగడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మాముళ్ల రోజుల్లో అయితే అమ్మాయిలు పబ్బులు, రెస్టారెంట్లలో సిటీ కల్చర్ పేరుతో గుట్టుగా మద్యం సేవించేవారు. లాక్డౌన్ పుణ్యామా అంటూ అవన్నీ ఇప్పుడు క్లోజ్ అయ్యాయి. దీంతో చేసేదేమీలేక మహిళలు కూడా మద్యం షాపులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఒకటి రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు నేటి నుంచే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు కూడా మద్యం షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. వీరి కోసం మద్యం షాపుల యజమానులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తూ వారిని క్లియర్ చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ మద్యం షాపు ఎదుట మహిళలు క్యూలైన్లలో నిల్చోన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.