భర్త మృతదేహంతో సరిహద్దు దగ్గర భార్య ఆవేదన!

తెలంగాణా నుంచి ఏపీకి ఓ మహిళ తన భర్త మృతదేహంతో వచ్చింది. తమ సొంత ఊరిలో అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పింది. ఐతే… ఏపీలోకి రావడానికి ఇప్పుడు అనుమతి లేదని పోలీసులు ఆమెకు చెప్పారు. దాంతో ఆమె… రాత్రంతా సరిహద్దు దగ్గరే భర్త మృతదేహంతో జాగారం చేసింది. తన భర్త గుండెపోటుతో చనిపోయాడనీ మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని చెప్పినా పోలీసులు అనుమతించలేదని ఆవేదన చెందుతోంది. ఈ ఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన గుంటూరులోని దాచేపల్లి సరిహద్దు […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 4:14 pm
Follow us on

తెలంగాణా నుంచి ఏపీకి ఓ మహిళ తన భర్త మృతదేహంతో వచ్చింది. తమ సొంత ఊరిలో అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పింది. ఐతే… ఏపీలోకి రావడానికి ఇప్పుడు అనుమతి లేదని పోలీసులు ఆమెకు చెప్పారు. దాంతో ఆమె… రాత్రంతా సరిహద్దు దగ్గరే భర్త మృతదేహంతో జాగారం చేసింది. తన భర్త గుండెపోటుతో చనిపోయాడనీ మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని చెప్పినా పోలీసులు అనుమతించలేదని ఆవేదన చెందుతోంది. ఈ ఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన గుంటూరులోని దాచేపల్లి సరిహద్దు దగ్గర చోటుచేసుకుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను మాత్రమే… తమ తమ స్వరాష్ట్రాలకు వెళ్లమంది గానీ… అందర్నీ వెళ్లమని చెప్పలేదు. ఆ ప్రకారమే రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వెసులుబాట్లు కల్పించాయి. ఐతే… దీన్ని అదునుగా చేసుకొని… చాలా మంది రాష్ట్రాల సరిహద్దుల్ని రహస్యంగా దాటేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన గుంటూరులోని దాచేపల్లి సరిహద్దు దగ్గర… భారీగా ప్రజలు వలసలుగా బోర్డర్ దాటేస్తున్నారు. జనరల్‌ గా ఇలా సరిహద్దు దాటేందుకు ఇప్పుడు అనుమతి లేదు. అయినప్పటికీ కొంతమంది ఈ రూట్ వెతుక్కుంటున్నారు.

ఇలా సరిహద్దులు దాటేవాళ్లలో గర్భిణీలు కూడా ఉండటం విశేషం. పోలీసులు మాత్రం… ఎవరైనా సరిహద్దు దాటాలంటే… డీజీపీ పర్మిషన్ లెటర్ తప్పక ఉండాలని చెబుతున్నారు. తెలంగాణలో ఈ-పాస్ అనేది ఇస్తున్నారు. ఇది పొందిన వారు మాత్రమే సరిహద్దు దాటేందుకు వీలవుతుంది. ఐతే… ఈ ఈ-పాస్ అనేది… కేంద్రం చెప్పిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులకు మాత్రమే ఇస్తారు. అందువల్ల ఇలాంటి ఈ-పాస్ పొందలేకపోతున్నవారు… రహస్యంగా సరిహద్దులు దాటేస్తున్నట్లు తెలుస్తోంది.