
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేది అంశానికి మరో నిదర్శనం ఈ ఘటన. కామాంధుల దాహానికి మహిళలు బలవుతున్నారు. 72 ఏళ్ల వృద్ధురాలు కూడా ఇందుకు బాధితురాలే కావడం సిగ్గుపడే అంశం. నిద్రపట్టడం లేదని టీ తాగడానికి వెళ్లిన పాపానికి ఆ వృద్ధురాలు అత్యాచారానికి గురైంది. టీ తాగిన తరువాత నిద్రపట్టడానికి నీకు ఆసుపత్రిలో మంచి మందులు ఇస్తానని నమ్మించి తీసుకెళ్లిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురై 72 ఏళ్ల మహిళ కేకలు వేయడంతో పక్కనే ఉన్న పెద్దరాయి తీసుకుని ఆమె తలపై దాడి చేసి చంపేయ్యడానికి ప్రయత్నించాడు. ఎక్కడ దొరికిపోతానో అని భయంతో ఆసుపత్రి నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
Also Read: గంటా.. జేడీ స్పెషల్ భేటీ : అందుకేనట..?
చెన్నై తిరువోట్టియూర్‌లోని కలాడీపేట్ మార్కెట్ వీధిలో 72 అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. రాత్రి భోజనం చేసిన తరువాత క్రిష్ణవేణి ఇంటిలో నిద్రపోయారు. అర్ధరాత్రి నిద్ర రాకపోవడంతో క్రిష్ణవేణి చాలా ఇబ్బంది పడింది. నిద్ర రాలేదని కనీసం టీ అయినా తాగుదామని అర్ధరాత్రి మార్కెట్ సమీపంలో టీ తాగడానికి వెళ్లింది. ఆమెను ఓ వ్యక్తి పలకరించాడు. వాడే ఆమెకు రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టీ తీసిచ్చాడు. వృద్ధురాలు టీ తాగుతున్న సమయంలో ‘మీకు ఎందుకు నిద్రరావడం లేదు, మాత్రలు, మందులు ఏమైనా వేసుకుంటున్నారా’ అంటూ మాయమాటలతో మాట్లాడిన కిరాతకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
Also Read: టీఆర్‌ఎస్ మరోసారి ఆ సీటును వదులుకున్నట్లేనా..?
‘మీకు ఆసుపత్రిలో మందులు, మాత్రలు నేను ఇస్తానని, అవి వేసుకుంటే రాత్రిపూట హాయిగా నిద్రపడుతుందని, నా వెంటరావాలని’ ఆ వృద్ధురాలిని నమ్మించాడు. ఆసుపత్రి ఆవరణలోకి తీసుకెళ్లిన కామాంధుడు ఆమె నోరు గట్టిగా మూసిపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. కొంత సేపటి తరువాత ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో చిక్కిపోతామని భయపడిన కామాంధుడు సమీపంలోని రాయి తీసుకుని ఆమె తల మీద దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తలకు తీవ్రగాయాలై రక్తం ఎక్కువ పోవడంతో నొప్పి తట్టుకోలేక ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేసింది. ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు ప్రథమ చికిత్స చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గంట తరువాత ఆ యువకుడు ఒంటరిగా అక్కడి నుంచి ఆందోళనతో బయటకు వెళ్లిపోయాడని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు వెల్లడించారు. కిరాతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Comments are closed.