ఏపీలో 70 కేసులు మర్కజ్ నుండి వచ్చిన వారివే

రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ లోని మర్కజ్ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మర్కజ్ కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి రాగా, మొత్తం 585మందికి పరీక్షలు జరిపితే 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 7:27 pm
Follow us on

రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ లోని మర్కజ్ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మర్కజ్ కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి రాగా, మొత్తం 585మందికి పరీక్షలు జరిపితే 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది కోసం గాలింపు చేపట్టామని చెబుతూ 104కు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు.

ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ ఎవచెప్పారూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని తెలిపారు. అయితే వయసు మళ్లినవారిలో ఈ వైరస్‌ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదని ప్రజలు గుర్తించాలని కోరారు. కొన్నిచోట్ల దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందని గుర్తుచేశారు. వైరస్‌వచ్చిన వ్యక్తుల పట్ల వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని గుర్తుచేశారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు వారికి తెలియజేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా,కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడిందని సీఎం జగన్‌ తెలిపారు. భారమైనప్పటికీ వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.