https://oktelugu.com/

ఫోన్ పే ఉందా.? అయితే మీకే ఈ ‘కరోనా కేర్’ గుడ్ న్యూస్!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విజ్రంభిస్తోన్న సమయంలో భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే చాలామంది భారతీయులకు ఆరోగ్య బీమా సదుపాయం లేదు. ఇప్పటికే ఉన్నదానికి కరోనా చికిత్స మరో ఆర్థిక భారం కానుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్‌ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ను డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే అందుబాటులోకి తెచ్చింది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 1, 2020 / 07:31 PM IST
    Follow us on

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విజ్రంభిస్తోన్న సమయంలో భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే చాలామంది భారతీయులకు ఆరోగ్య బీమా సదుపాయం లేదు. ఇప్పటికే ఉన్నదానికి కరోనా చికిత్స మరో ఆర్థిక భారం కానుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్‌ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ను డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే అందుబాటులోకి తెచ్చింది.

    కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు “కరోనా కేర్” బీమా ఆసరాగా ఉంటుందని వెల్లడించింది. దీనికింద ఒకేసారి రూ.156 చెల్లించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 వరకు రక్షణ పొందవచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చేరడానికి ముందు, తరవాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలుకు అయ్యే తదితర ఖర్చులను చెల్లించనుంది. ఫోన్‌ పే యాప్ ద్వారా చెల్లింపు చేయగానే ఈ డిజిటల్ పాలసీ వెంటనే జనరేట్ అవుతుందని తెలిపింది. అయితే ఆ బీమాను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి 15 రోజుల్లోగా కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుందని, అలాగే 55 సంవత్సరాల లోపు వయసు పరిమితిని విధించింది.
    Also Read: స్మార్ట్ ఫోన్లపై కరోనా వైరస్ ఎన్నిరోజులు ఉంటుందో తెలుసా..?