సింధియా బాటలో పలువురు కాంగ్రెస్ నేతలు!

కాంగ్రెస్ నుండి నిష్క్రమించి బీజేపీలో చేరుతున్న జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా రాజస్థాన్, మహారాష్ట్రాలలోని ప్రభుత్వాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధియాకు సన్నిహితుడైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హర్యానా యువ నాయకుడు దీపేందర్ సింగ్ హుడ్డా, మహారాష్ట్ర యువ నాయకుడు మిలింద్ దేవరా తదితర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా […]

Written By: Neelambaram, Updated On : March 11, 2020 3:41 pm
Follow us on

కాంగ్రెస్ నుండి నిష్క్రమించి బీజేపీలో చేరుతున్న జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా రాజస్థాన్, మహారాష్ట్రాలలోని ప్రభుత్వాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సింధియాకు సన్నిహితుడైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హర్యానా యువ నాయకుడు దీపేందర్ సింగ్ హుడ్డా, మహారాష్ట్ర యువ నాయకుడు మిలింద్ దేవరా తదితర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. వీరంతా కుడా రాహుల్ గాంధీ కి సన్నిహితులు కావడం గమనార్హం. ఈ పరిణామాలు కాంగ్రెస్ లో కలవరాన్ని కలిగిస్తున్నాయి.

ఇదిలాఉండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా సింధియా రాజీనామాపై స్పందించక పోవడం గమనార్హం. సుమారు రెండు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న తనను పార్టీలో అవమానాలు జరుగుతూ ఉండడంతో అసంతృప్తిగా ఉన్నా సోనియా, రాహుల్ పట్టించుకొనక పోవడం పట్ల సింధియా ఆగ్రహంతోనే పార్టీని విడిచారని ప్రచారం జరుగుతున్నది.

వీరి బాటలోనే మహారాష్ట్రలోని శివసేనకు చెందిన పలువురు ఎమ్యెల్యేలు సహితం బిజెపి నాయకులతో సంప్రదింపులతో ఉన్నట్లు చెబుతున్నారు.