https://oktelugu.com/

Bank Holidays: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడో తెలుసా?

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో దసరా వేడుకులను నిర్వహించుకుంటారు. దసరా వేడుకుల్లో నిర్వహించేది ముఖ్యమైనది ఆయుధ పూజ. కొన్ని పారిశ్రామిక సంస్థలు, పోలీస్ స్టేషన్లు, వివిధ ఆయుధాలు, వాహనాలు కలిగిన వారు ఆయుధ పూజ నిర్వహించుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 11, 2024 2:28 pm
    Bank Holidays

    Bank Holidays

    Follow us on

    Bank Holidays: ప్రస్తుతం కాలంలో బ్యాంకులతో ఖచ్చితంగా పని ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవహారమైనా బ్యాంకు ద్వారానే జరుగుతుంది. డిజిటల్ టెక్నాజలీ అందుబాటులోకి వచ్చిన తరువాత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కానీ బ్యాంకు లింకేజీతనే వ్యవహారాలు సాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు బ్యాంకులు కొనసాగకపోయినా.. వరుస సెలవులు వచ్చినా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల బ్యాంకు హాలీడేస్, పనిచేయని రోజుల గురించి ముందే తెలిసి ఉండాలి. లేకుంటే ఏదైనా ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు జరపాలనుకుంటే బ్యాంకుకు వెళ్లి ఆందోళన చెందుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తుంది. వీటిలో కొన్ని జాతీయ సెలవులు ఉండగా.. మరికొన్ని ప్రాంతీయ పరిస్థితుల ఆధారంగా బ్యాంకులు సెలవు దినాలు ఉంటాయి. అయితే ఈ అక్టోబర్ లో 11 నుంచి వరుసగా 4 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఎందుకంటే?

    దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో దసరా వేడుకులను నిర్వహించుకుంటారు. దసరా వేడుకుల్లో నిర్వహించేది ముఖ్యమైనది ఆయుధ పూజ. కొన్ని పారిశ్రామిక సంస్థలు, పోలీస్ స్టేషన్లు, వివిధ ఆయుధాలు, వాహనాలు కలిగిన వారు ఆయుధ పూజ నిర్వహించుకుంటారు. అయితే ఈ ఆయుధ పూజ దేశంలో ఒకేసారి కాకుండా వారి ప్రాంతాలకు అనుగుణంగా నిర్వహించుకుంటారు. అక్టోబర్ 11న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కలకత్తా వ్యాప్తంగా అక్టోబర్ 11న బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

    అక్టోబర్ 12న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దసరా వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఈ కారణంగా ఆయుధ పూజ నిర్వహించే ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో ఆయుధ పూజతో పాటు జమ్మి పూజ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో ఇదే బిగ్ ఫెస్టివెల్ అనుకోవచ్చు. దీంతో అక్టోబర్ 12న బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఈరోజు బ్యాంకులు మాత్రమే కాకుండా మిగతా సంస్థలు కూడా సెలవులు ప్రకటిస్తారు.

    అక్టోబర్ 13న ఆదివారం కానుంది. ఈరోజు సాధారణ హాలీడే ఉండనుంది. అయితే ఎస్ బీఐ కి చెందిన కొన్ని బ్యాంకులు ఆదివారం కూడా కొనసాగి సోమవారి సెలవును ప్రకటిస్తాయి. కానీ చాలా వరకు బ్యాంకులు మాత్రం ఆదివారం సెలవు కావడంతో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 14న సోమవారం మరికొన్ని ప్రాంతాల్లో ఆయుధ పూజ నిర్వహిస్తున్నారు. ఈకారణంగా అక్కడ కూడా బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. ఈ సంద్భంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకు వ్యవహారాలు సాగవు.

    ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలు సాగించాలనుకునేవారు మంగళవారం వరకు ఆగాల్సిందే. అయితే భూమి రిజిస్ట్రేషన్, తదితర బిగ్ పేమెంట్స్ కు కొంచెం సమయం తీసుకోవడం బెటర్. ఎందుకంటే మంగళవారం రెగ్యులర్ ట్రాన్జాక్షన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సర్వర్ బిజీ అయి కొన్ని పనిచేయవు. అందువల్ల బుధవారం నాడు బ్యాంకు కు వెళ్లి ఏదేని ఆర్థిక వ్యవహారాలు జరుపుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు.