Viswam Movie Review: విశ్వం ఫుల్ మూవీ రివ్యూ…

శ్రీనువైట్ల దర్శకత్వంలో మరోసారి రొటీన్ కమర్షియల్ సినిమాగా విశ్వం సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా మీదనే భారం వేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించారా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : October 11, 2024 1:52 pm

Viswam Movie Review

Follow us on

Viswam Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ మంచి కథలతో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో యంగ్ డైరెక్టర్స్ మాత్రం ఎవరికీ వారే సరికొత్త సినిమాలను చేస్తూ వాళ్ళు ఏదైతే కథ చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ ను స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది సక్సెస్ అయితే మరి కొంత మంది మాత్రం పెద్దగా విజయాలను అందుకోలేకపోతున్నారు. ఇక నిజానికి గోపీచంద్ లాంటి నటుడు సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఆయనకు ఒక్క సక్సెస్ కూడా దక్కడం లేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాల్లో పెద్దగా వైవిధ్యం అయితే ఉండడం లేదు. మరి ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మరోసారి రొటీన్ కమర్షియల్ సినిమాగా విశ్వం సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా మీదనే భారం వేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించారా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో గోపి చంద్ ఏదైనా సరే ఒకసారి తనది అనుకుంటే చాలు దాని కోసం ఇక్కడి దాకా అయిన వెళుతాడు. ఇక మొత్తాబికైతే తను అనుకున్నది సాధిస్తాడు. అలాంటి మెంటాలిటీ తో ఉన్న హీరోకి ఒక చిన్న పాప పరిచయం అవుతుంది. మరి ఆ పాప ఒంటరిగా ఎందుకు ఉంటుంది. ఆ పాపకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి దానికి గోపి ఎలా రియాక్ట్ అయ్యాడు. ఈ ప్రాసెస్ లో విల్లన్ తో గోపి కి జరిగిన గొడవలు ఏంటి అనేవి తెలియాలంటే మాత్రం తప్పకుండా మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని శ్రీను వైట్ల ముందుకు తీసుకెళ్లిన విధానం బాగాలేదు. తను రాసుకున్న కథ రొటీన్ రొట్ట ఫార్ములా కథ కావడం వల్లే సినిమా ప్రేక్షకుడిని అంత బాగా ఎంగేజ్ చేయలేక పోయిందనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ గా సినిమా కథ మాత్రం ప్రేక్షకుడి ని నిరాశ పరుస్తుంది. ఒక పది సంవత్సరాల క్రితం సినిమాలు వచ్చి సక్సెస్ లను సాధించాయి. మరి ఈ జనరేషన్ లో కూడా అవే కథలను రిపీట్ చేస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. అందువల్లే ఈ సినిమాని ప్రేక్షకులు ఎక్కువగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా గోపిచంద్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది.

ఆయన ఇంట్రడక్షన్ గాని ఆయన మాస్ ఎలివేషన్స్ సీన్స్ గాని అద్భుతంగా ఉన్నాయి. ఇక ఎమోషన్స్ బాగున్నప్పటికీ సినిమా మొత్తం ఆ రేంజ్ లో లేకపోవడం గమనర్హం…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక అలాగే సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ మాత్రం సినిమాలో ఇరికించి పెట్టినట్టుగా అనిపించింది. సీన్ల మధ్య ఒక ఫ్లో లేకపోవడం వల్లే అలాంటి ఒక ఫీల్ అయితే కలుగుతుంది.

మరి ఆ ట్రైన్ ఎపిసోడ్ ను ఎందుకు సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారు అనేది పక్కన పెడితే ఎపిసోడ్ లేకపోయినా కూడా ప్రేక్షకులు సినిమాకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాడు… ఇక సాంగ్స్ విషయంలో క్లైమాక్స్ లో వచ్చే ఒక సాంగ్ అయితే చిరాకు పుట్టిస్తుంది. నిజంగా ఆ సాంగ్ ప్లేస్ మెంట్ బాలేకపోవడం ఒకెత్తైతే ఆ సాంగ్ కూడా బాగా లేకపోవడం ప్రేక్షకుడిలో ఒక తెలియని అసహనాన్ని కలిగిస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే గోపిచంద్ ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటన తీరును కనబరిచాడు. ముఖ్యంగా ఆయన పోషించిన ఈ పాత్ర ఇంతవరకు గోపీచంద్ ఆయన కెరియర్ లో చేయనటువంటి పాత్ర అయినప్పటికీ సినిమా కథలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వల్ల ఆయన క్యారెక్టరైజేషన్ అనేది అంత బాగా ఎలివేట్ అవ్వలేదు. కానీ గోపీచంద్ మాత్రం తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాకి ప్రాణం పోశాడు… ఇక హీరోయిన్ కావ్య తాపర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. వెన్నెల కిషోర్ అక్కడక్కడ తన కామెడీతో చమక్కులు మెరిపించాడు…

నరేష్, ప్రగతి లాంటి సీనియర్ నటులు సైతం వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు… ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా తమ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ని వాడుతూ నటించడం అనేది చాలా మంచి విషయం..ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడా చాలా మంచి క్యారెక్టర్ లో నటించి సినిమాకి కొంతవరకు మైలేజ్ అయితే ఇచ్చాడు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. శ్రీను వైట్ల ఈ సినిమా కోసం చేతన్ భరద్వాజ్ ను తీసుకొని చాలా మంచి ప్రయత్నం అయితే చేశాడు. దానికి తగ్గట్టుగానే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఒక అమ్మ సెంటిమెంట్ సీన్ దగ్గర మాత్రం ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయింది… ఇక ఈ సినిమాకి విజువల్స్ కూడా చాలా వరకు చాలా యూజ్ అయ్యాయి.

ముఖ్యంగా గుహన్ అందించిన విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు రావడమే కాకుండా ఈ సినిమాకి ఒక బెస్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికి గుహన్ అహర్నిశలు కష్టపడ్డాడు… ఇక ఎడిటర్ అమర్ రెడ్డి కూడా షార్ప్ ఎడిట్ చేశాడు. కానీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్స్ కట్ చేసేస్తే బాగుండేది…ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

గోపి చంద్
కొన్ని ఎమోషనల్ సీన్స్
బ్యా గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కథ
ప్రజంటేషన్ కొత్త గాలేకపోవడం..
అనవసరమైన సీన్లు

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్
ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు తీస్తే కష్టం సీనా (శ్రీను వైట్ల)