https://oktelugu.com/

మరిన్ని బ్యాంకులు ప్రైవేటుపరం : ప్రైవేటుబాటలోనే మోడీ

అదేంటో.. ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పుతుంటారు. కేంద్ర ప్రభుత్వాలైనా.. రాష్ట్ర ప్రభుత్వాలైనా తమ ఆధ్వర్యంలో పలు సంస్థలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని చూస్తుంటాయి. కానీ.. మోడీ సర్కార్‌‌ కేంద్రంలో అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దొరికినవి దొరికినట్లుగా అమ్మేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. Also Read: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు.. : బెంబేలెత్తుతున్న వాహనదారులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఎంత కుదిరితే […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 / 10:56 AM IST
    Follow us on


    అదేంటో.. ఎక్కడైనా ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పుతుంటారు. కేంద్ర ప్రభుత్వాలైనా.. రాష్ట్ర ప్రభుత్వాలైనా తమ ఆధ్వర్యంలో పలు సంస్థలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని చూస్తుంటాయి. కానీ.. మోడీ సర్కార్‌‌ కేంద్రంలో అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దొరికినవి దొరికినట్లుగా అమ్మేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

    Also Read: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు.. : బెంబేలెత్తుతున్న వాహనదారులు

    కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఎంత కుదిరితే అంత ప్రైవేటుకు కట్ట బెట్టడానికి ప్రయత్నిస్తున్న కేంద్రం.. తాజాగా బ్యాంకుల్ని కూడా ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించుకుంది. నాలుగు బ్యాంకులను అమ్మకానికి పెట్టేలా నిర్ణయం తీసుకుంది. నిజానికి చిన్న బ్యాంకుల్ని పెద్దగా చేస్తామంటూ ఇటీవల బ్యాంకుల విలీనం పూర్తి చేసింది. చిన్న బ్యాంకుల్ని పెద్దవిగా చేసింది. అలా చేసిన వాటిలో నాలుగింటిని ప్రైవేటుకు అమ్మబోతోంది. అంటే.. పేరుకు నాలుగే కానీ విలీనం కాక ముందు పరిస్థితి చూస్తే అమ్మబోయేది పది బ్యాంకులపైనే.

    బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను అమ్మాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. రెండింటిని వచ్చే ఏడాదిలోనే అమ్మేయబోతున్నారని మీడియా వర్గాలు ధృవీకరించాయి. బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. తొలుత చిన్న బ్యాంకులు, మధ్య తరగతి బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తారు. తర్వాత పెద్ద బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేస్తారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ప్రభుత్వం అత్యధిక వాటాను ఉంచుకుంటుందట. అంటే ప్రభుత్వ బ్యాంక్ ఒక్క ఎస్‌బీఐ మాత్రమే ఉంటుందనేది స్పష్టం.

    Also Read: అక్కడ టీడీపీ ఆశలు గల్లంతేనా..!

    ప్రైవేటును ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు మాత్రమే కాదు సాధారణ ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు. దానికి అందరూ సిద్ధమే కానీ కొత్తగా ప్రైవేటు కంపెనీలు పెట్టాలి. కానీ.. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయడం ఏమిటని అంటున్నారు. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుంటున్న బడా వ్యాపారులు అవి తీర్చడం లేదు. దాని వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. కానీ.. ఆ లోన్ డిఫాల్టర్స్ ఇప్పటికీ ప్రముఖులుగానే చెలామణి అవుతున్నారు. మొత్తానికి కేంద్రం.. చాలా దూకుడుగా ప్రైవేటు నిర్ణయాలను అమలు చేస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్