ఏపీ కేబినెట్ భేటి ఈరోజు జరుగుతోంది. అమరావతిలోని సచివాలయం మొదటి అంతస్తులోని హాల్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: అక్కడ టీడీపీ ఆశలు గల్లంతేనా..!
అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ బడ్జెట్ లో కీలకమైనవి ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు, సంక్షేమ పథకాలతోపాటు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలని భావిస్తున్నారట.. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్మాయాల్ని కూడా మోడీకి రాసిన లేఖలో జగన్ వివరించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నారు.
Also Read: సంక్షేమ పథకాలే కాదు.. ఆధ్యాత్మికంలోనూ పాలుపంచుకోవాలి: జగన్‌కు పీకే టీమ్ సూచన
ఇక ఏపీ మూడు రాజధానుల దిశగా కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్ సర్కార్ దాన్ని అమలు చేయాలని భావిస్తోంది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇక రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే జోరు చూపించాలని జగన్ ఇప్పటికే శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, నవరత్నాల అమలు, గ్రామ వలంటీర్ల సమస్యలు, రేషన్ డోర్ డెలివరీ అడ్డంకులు, కరోనాపై చర్యలు లాంటి ఇతర అంశాలపై కూడా సుధీర్ఘంగా సమావేశంలో చర్చించబోతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్